ఘనంగా బుల్లితెర నటి లహరి సీమంతం! వైరల్ ఫొటోలు

  • Author Soma Sekhar Published - 05:00 PM, Wed - 9 August 23
  • Author Soma Sekhar Published - 05:00 PM, Wed - 9 August 23
ఘనంగా బుల్లితెర నటి లహరి సీమంతం! వైరల్ ఫొటోలు

బుల్లితెరపై తన యాక్టింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది నటి లహరి. తన అందం, అభినయంతో టీవీ సీరియల్స్ లో దూసుకెళ్తోంది. ఇక అప్పుడప్పుడు వెండితెరపై కూడా కనిపిస్తూ.. సందడి చేస్తుంటుంది ఈ బ్యూటీ. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలో నటించి మంచి మార్కులు కూడా కొట్టేసింది లహరి. ఇక బుల్లితెర స్టార్ సీరియల్స్ అయిన ముద్దు బిడ్డ, చక్రవాకం, మెుగలి రేకులు, ఇంటింటి గృహలక్ష్మీ లాంటి సీరియల్స్ తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా.. తను ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిన విషయమే. తాజాగా లహరి సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బుల్లితెర నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది లహరి. ఓ వైపు సీరియల్స్ తో పాటుగా.. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసుకుని వ్లాగ్స్, వీడియోలు చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటూంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో లహరి సీమంతానికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ మేరకు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఘనంగా లహరి సీమంతం వేడుకలు జరిగాయి. తన భర్త, కుటుంబ సభ్యుల సమక్షంలో లహరి సీమంతం వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి ఈ సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. కాగా.. కొద్ది రోజుల్లోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న లహరికి ఇప్పటి నుంచే శుభాకాంక్షలు తెలుపుతున్నారు పలువురు నటీ, నటులు, అభిమానులు.


ఇదికూడా చదవండి: ఆ వ్యాధితో చాలా ఏళ్లు సతమతమైన మహేష్​.. ఆయన బాధ చూడలేక నమ్రత..!

Show comments