పవిత్ర జయరామ్‌ భర్త ఎమోషనల్‌ పోస్ట్‌.. ఒక్కసారి తిరిగి రావా అంటూ

Trinayani Serial Fame Pavitra Jayaram: సీరియల్‌ నటి పవిత్ర జయరామ్‌ రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె భర్త చేసిన ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. ఆ వివారలు..

Trinayani Serial Fame Pavitra Jayaram: సీరియల్‌ నటి పవిత్ర జయరామ్‌ రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె భర్త చేసిన ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. ఆ వివారలు..

ప్రముఖ సీరియల్‌ నటి పవిత్ర జయరామ్‌.. ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. త్రినయని సీరియల్‌లో తిలోత్తమ పాత్ర ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ప్రస్తుతం తెలుగులో వరుస సీరియల్స్‌లో నటిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక త్రినయని సీరియల్‌లో తిలోత్తమ పాత్రలో ఆమె పండించే విలనిజం గెరించి ఎంత చెప్పినా తక్కువే. తిలోత్తమ అంటే చాలు ప్రతి ఒక్కరు టక్కున గుర్తు పడతారు. సవతి అత్త పాత్రలో ఆమె విలనిజం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇక ఆమె మృతితో త్రినయని సీరియల్‌కు భారీ లాస్‌ అనే చెప్పవచ్చు. ఇక తిలోత్తమ మృతి నేపథ్యంలో ఆమె భర్త.. సోషల్‌ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

పవిత్ర జయరామ్‌ ఆదివారం నాడు కర్ణాటక నుంచి హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో ఆమె భర్త చంద్రకాంత్‌ కూడా ఉన్నారు. ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. ఇక పవిత్ర మృతి నేపథ్యంలో చంద్రకాంత్‌ చేసిన ఎమోషనల్‌ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. ఆమెతో దిగిన చివరి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు చంద్రకాంత్‌. ‘‘పాప నీతో దిగిన లాస్ట్‌ పిక్‌ రా. నన్ను ఒంటరిగా వదిలి వెళ్లి పోయావు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఒక్కసారి మామా అని పిలువే.. ప్లీజ్‌. నా పవిత్ర ఇక లేదు.. ప్లీజ్‌ నా కోసం ఒక్కసారి తిరిగి రావా’’ అంటూ.. ఆమె భర్త చంద్రకాంత్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

పవిత్ర తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఆమెకు చిన్న వయసులోనే వివాహం చేశారు. 16 ఏళ్లకే పెళ్లైంది. ఇద్దరు పిల్లలు సంతానం. ఆ తర్వాత భర్త నుంచి విడిపోయింది. ప్రారంభంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది. ఆ తర్వాత కన్నడ సీరియల్స్‌లో నటిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నిన్నే పెళ్లాడతా ఆమె మొదటి సీరియల్‌. ఆ తర్వత త్రినయని ధారావాహికలో ఆమె తిలోత్తమ పాత్రలో కనిపించింది. ఈ క్యారెక్టర్‌ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. పవిత్ర కన్నా కూడా తిలోత్తమగానే ఫేమస్‌ అయ్యింది. ఇక తిలోత్తమ మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువుల, మిత్రలు, తోటి నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Show comments