ఆపరేషన్ సిందూర్ మూవీ టైటిల్ కోసం నిర్మాతల పోటీ !

ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా మీడియా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు ఆపరేషన్ సింధూర్. పహాల్గమ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఉగ్రవాద ఉగ్రవాద స్థానాలపై భారత్ ఏకకాలంలో దాడులు చేసింది. ఇలా ఇరు దేశాల మధ్య భారీ సంఘటనలు చోటు చేసుకుంటున్న క్రమంలో ఇప్పుడు వీటిపై సినిమాలు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా మీడియా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు ఆపరేషన్ సింధూర్. పహాల్గమ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఉగ్రవాద ఉగ్రవాద స్థానాలపై భారత్ ఏకకాలంలో దాడులు చేసింది. ఇలా ఇరు దేశాల మధ్య భారీ సంఘటనలు చోటు చేసుకుంటున్న క్రమంలో ఇప్పుడు వీటిపై సినిమాలు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మే 6, ఏప్రిల్ 22 ఈ రెండు తేదీలను ఎవరు అంత త్వరగా మర్చిపోలేరు. ఏప్రిల్ 22 పహల్గాం దాడిలో ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు. దానికి ప్రతీకారంగా మే 6 అర్ధరాత్రి భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. దీనికి సంబందించిన ప్రతి అప్డేట్ మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. పాకిస్తాన్ దీనికి ప్రతిచర్య తీసుకుంటుందా ! ఒకవేళ తీసుకుంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలవుతుందా ! అసలు ఏమి జరగబోతుంది ! అనే ప్రశ్నలతో అంతా భయంగా ఉన్నారు. ఎక్కడ చూసినా ఆపరేషన్ సింధూర్ అనే పేరు మోత మోగిపోతుంది. ఇదంతా ఒకవైపు సాగుతుంటే.. మరోవైపు సినీ ఇండస్ట్రీ మాత్రం ఈ సంఘటనలపై సినిమా తీయడానికి సిద్ధం అవుతుంది. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయడానికి నిర్మాతల మధ్య పోటీ జరుగుతుందట.

ఆపరేషన్ సింధూర్ అనే రాగానే.. వివిధ చిత్ర నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వినిపిస్తున్న కథనాల ప్రకారం మహావీర్ జైన్ ఈ రేస్ లో ముందు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కంపెనీ మొదట టైటిల్ ను నమోదు చేసిందని టాక్. ఈ సంస్థతో పాటు జీ స్టూడియోస్ , టి సిరీస్ కూడా ఈ పేరును రిజిస్టర్ చేసుకున్నాయట . అంతే కాకుండా ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ కూడా ఈ పేరును రిజిస్టర్ చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్ లో ఇలాంటి అంశాల మీద చాల సినిమాలు తెరకెక్కాయి. ది సర్జికల్ స్ట్రైక్ , బోర్డర్ , ఆమ్రాన్ , రాజి లాంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు గడిచిపోయినా నిజాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాయి. అందుకోసమే ఇప్పుడు చాలా మంది నిర్మాతలు ఆపరేషన్ సింధూర్ పై సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు అయితే దీనిని ఏ చిత్ర నిర్మాతకు ఇస్తారు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అలాగే దీనిని ఏ దర్శకుడు తెర మీద చూపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించిన విషయాలు త్వరలోనే తెలియనున్నాయి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments