తెలుగు సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీలోని నటీ, నటులు, టెక్నిషీయన్స్ పలు కారణాలతో మరణించడం బాధాకరమైన విషయం. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణ వార్త మరచిపోక ముందే.. ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ రైటర్ గా వెలుగొందుతున్న మరుధూరి రాజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దాంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మరుధూరి రాజా.. టాలీవుడ్ లో దాదాపుగా 200 సినిమాలకు పైగా రచయితగా పనిచేశారు. తన మెుదటి సినిమా ‘ఒంటరి పోరాటం’ నుంచి రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ డైరెక్టర్స్ ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణరెడ్డి, రాఘవేంద్రరావు లాంటి అగ్ర దర్శకుల సినిమాలకు రచయితగా పనిచేశారు. అయితే తాజాగా ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాదాన్ని ఆయనే స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు.
26వ తేది సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు అనారోగ్య కారణంగా నా పెద్ద కొడుకు నా నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఆ రోజు ఏమీ అర్థం కాలేదు. ఏదో తెలియని అయోమయ స్థితిలో వెంటనే ఈ విషయాన్ని తెలియపరచలేకపోయాను. ప్రస్తుతానికి ఇదే చెప్పగలను అంటూ సోషల్ మీడియాలో తన కొడుకుతో దిగిన పిక్ ను షేర్ చేశాడు. ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పలువురు సినీ ప్రముఖులు.