Venkateswarlu
బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఒకరు సంచలన ప్రకటన చేశారు..
బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఒకరు సంచలన ప్రకటన చేశారు..
Venkateswarlu
వన్డే వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా సత్తా చాటుతోంది. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో భారత్ విజయం సాధించింది. సెమీస్‌లో 70 పరుగుల తేడాపై ప్రత్యర్థి దేశాన్ని ఓడించింది. ఇక, టోర్నీ మొదలైన నాటినుంచి టీమ్ ఇండియా అపజయం అన్నదే లేకుండా దూసుకెళుతోంది. ఆదివారం జరగనున్న ఫైనల్ కోసం ప్రతీ భారతీయుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలుగు హీరోయిన్ ఒకరు సంచనల ప్రకటన చేశారు. టీమ్ ఇండియా కప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతానని అన్నారు.
టాలీవుడ్ హీరోయిన్ రేఖ భోజ్ ఈ సంచలన ప్రకటన చేశారు. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా వైజాగ్ బీచ్‌లో తిరుగుతాను అని అన్నారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ‘‘ ఒక వేళ ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. నేను వైజాగ్ బీచ్‌లో స్ట్రీకింగ్(బట్టలు లేకుండా నగ్నంగా తిరగటం) చేస్తాను’’ అని అన్నారు. ఈ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, వైజాగ్‌కు చెందిన రేఖ భోజ్ యువ దర్శకుడు రాకేష్‌రెడ్డి తీసిన ‘‘కాలాయ తస్మై నమః’’ సినిమాతో హీరోయిన్‌గా మారారు. ఇప్పటి వరకు దాదాపు ఐదు సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు పలు షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించారు. షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా రేఖ హీరోయిన్‌గా గతంలో ‘‘ లవ్ ఇన్ వైజాగ్’’ అనే షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. వీరి కాంబినేషన్‌లో తర్వాత ‘డర్టీ పిక్షర్’ అనే సినిమా వచ్చింది. ప్రముఖ నటుడు బండి సరోజ్ కుమార్‌తో కలిసి ఓ సినిమా కూడా చేశారు. రేఖ బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో తరచుగా వార్తలో నిలుస్తూ ఉంటారు.
బట్టలు లేకుండా పబ్లిక్ ప్లేసులో పరుగులు తీయడాన్ని స్ట్రీకింగ్ అంటారు. ఆటల్లో తమ కిష్టమైన జట్టు విజయం సాధించినపుడు కొందరు పట్టరాని ఆనందంతో బట్టలు లేకుండా గ్రౌండ్‌లోనో..బయటో పరుగులు తీస్తూ ఉంటారు. 1960 నుంచి ఈ పదం వాడుకలో ఉంది. ఇండియాలో స్ట్రీకింగ్ సంఘటనలు చాలా తక్కువ. విదేశాల్లో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూ ఉంటాయి. క్రికేట్, ఫుట్‌బాల్, త్రోబాల్ ఇలాంటి ఆటల్లో ఎక్కువగా స్ట్రీకింగ్ అవుతూ ఉంటుంది. అయితే, ఇది చట్టరీత్యా నేరం. స్ట్రీకింగ్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటారు. మరి, ఇండియా వరల్డ్ కప్ పైనల్‌లో విజయం సాధిస్తే స్ట్రీకింగ్ చేస్తానన్న రేఖ భోజ్ సంచలన ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.