Tirupathi Rao
tiragabadara saami Pre Release Event Raj Tarun Serious On Reporter: తిరగబడరా సామి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రాజ్ తరుణ్ ఒక రిపోర్టర్ పై ఫైర్ అయ్యాడు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు అంటూ కామెంట్ చేశాడు.
tiragabadara saami Pre Release Event Raj Tarun Serious On Reporter: తిరగబడరా సామి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రాజ్ తరుణ్ ఒక రిపోర్టర్ పై ఫైర్ అయ్యాడు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు అంటూ కామెంట్ చేశాడు.
Tirupathi Rao
రాజ్ తరుణ్- మాల్వి మల్హోత్రా కాంబోలో వస్తున్న తిరగబడరాసామి మూవీ ఆగస్టు 2న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ప్రసాద్ ల్యాబ్స్ నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పెద్దఎత్తున మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ముఖ్యంగా సినిమా గురించే కాకుండా.. రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలానే ప్రశ్నలు అడిగారు. అసలు రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ ఏమైంది? నిజంగానే మోసం చేశారా? మీరు తప్పు చేయకపోతే ఎందుకు బయటకు రాలేదు? ఇలా చాలానే ప్రశ్నలు రాజ్ తరుణ్ కు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్- ఒక లేడీ రిపోర్టర్ కు చిన్న వాగ్వాదం జరిగింది.
తాను ఎంతో ధైర్యం తెచ్చుకుని బయటకు వచ్చినట్లు రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ఎంతో బాధలో ఉన్నానని.. కానీ, ధైర్యంగా బయటకు వచ్చాను అని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మొత్తం వివాదంలో తాను తప్పు చేయలేదు అని చెప్పాడు. అలాగే తన దగ్గర అన్నీ ఆధారులు ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు. వాటిని పోలీసులకు కూడా కాదు.. లాయర్ ద్వారా కోర్టులో సమర్పిస్తానని చెప్పాడు. ఇన్నాళ్లు తన సెలబ్రిటీ హోదా దెబ్బతింటుందనే సైలెంట్ గా ఉన్నాను అన్నాడు. ఇంక ఈ వివాదం గురించి వదిలేయాలి అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఆ విషయం గురించి కాకుండా.. సినిమా గురించి మాట్లాడాలని కోరాడు. అయితే ఎక్కువ ఈ వివాదానికి సంబంధించే ప్రశ్నలు వచ్చాయి.
లావణ్య వివాదానికి సంబంధించి మాట్లాడుతూ రాజ్ తరుణ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అసలు ఈ వివాదంలోకి తన తల్లిదండ్రులను ఎందుకు లాగారు అంటూ ప్రశ్నించాడు. అలాగే వాళ్ల ఇంటికి వెళ్లి తలుపులు బాదాల్సిన అవసరం అసలు ఏముందని ప్రశ్నించాడు. వాళ్లు హార్ట్ పేషెంట్స్ అని, హై బీపీ, షుగర్ ఉన్న వాళ్లని చెప్పుకొచ్చాడు. అలాంటి వాళ్లను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముందని నిలదీశాడు. ముఖ్యంగా ఒక ఛానల్ ఇలా చేసింది అంటూ రాజ్ తరుణ్ కామెంట్ చేశాడు. వెంటనే సదరు రిపోర్టర్ స్పందించింది. అయితే గుమ్మడికాయల దొంగ అనగానే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటూ రాజ్ తరుణ్ కామెంట్ చేశాడు. తాము ఏ వ్యక్తి కోసం పని చేయమని.. ప్రజల కోసం పనిచేస్తామంటూ క్లారిటీ ఇచ్చింది. మొదట లావణ్య ఇంటర్య్వూ తానే తీసుకున్నానని.. అందుకు ఇలా గ్రడ్జ్ పెట్టుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ రిపోర్టర్ వ్యాఖ్యానించింది. అయితే రాజ్ తరుణ్ మాత్రం ఆమెతో అస్సలు మాట్లాడలేదు. ఇదిలా ఉండగా.. ప్రసాద్ ల్యాబ్స్ బయట లావణ్య నిరసకు దిగింది. రాజ్ తరుణ్ ని కలవనివ్వాలని.. అతనితో మాట్లాడించాలంటూ డిమాండ్ చేసింది. పోలీసులు కలగజేసుకుని లావణ్యను అక్కడి నుంచి పంపించేశారు.