ఆ హీరోలు ఫోన్ చేసి మరీ రివ్యూస్ చెప్పద్దన్నారు: పూలచొక్కా నవీన్

సినిమా ఇలా విడుదలవ్వడం ఆలస్యం.. అలా యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో రివ్యూస్ అందిస్తూ అలరిస్తున్నారు ఇన్ఫ్యుయెన్సర్స్. అలాంటి వారిలో ఒకరు నవీన్ నాయక్.. అలియాస్ పూల చొక్కా. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు..

సినిమా ఇలా విడుదలవ్వడం ఆలస్యం.. అలా యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో రివ్యూస్ అందిస్తూ అలరిస్తున్నారు ఇన్ఫ్యుయెన్సర్స్. అలాంటి వారిలో ఒకరు నవీన్ నాయక్.. అలియాస్ పూల చొక్కా. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు..

సోషల్ మీడియాలో తనదైన స్టైల్లో రివ్యూస్ ఇస్తూ ఫేమస్ అయ్యారు ప్రముఖ ఇన్ఫ్యుయనర్స్ నవీన్ నాయక్ అలియాస్ పూలచొక్కా. థియేటర్లలో, ఓటీటీల్లో విడుదలైన సినిమాలు వాచ్ చేసి.. పూలచొక్కా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సమీక్షలు ఇస్తుంటారు. అలాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొంత మందిని స్పూస్, మీమ్స్ చేస్తూ.. చివరిలో పుచుక్.. పుచుక్ మ్యానరిజం చేస్తూ నెటిజన్లను అలరిస్తున్నాడు. సినిమాల్లో హీరో అవుట్ ఫిట్స్ రీ క్రియేట్ చేస్తుంటాడు. అయితే ఇటీవల ఓ మూవీ రివ్యూ ఇచ్చి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, తన రివ్యూస్, ఇతర విషయాలను పంచుకున్నాడు నవీన్ .

అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన రివ్యూస్ చెప్పడంపై స్పందించాడు. ‘రాజ్యాంగంలో అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన నేను రివ్యూలు చెప్పకూడదని రాయలేదు. నా ఇష్టం. నాకు ఏదీ చేయాలనిపిస్తే అదే చేస్తా. రేపు రోడ్డు మీద కొబ్బరి కాయలు కూడ అమ్ముకుంటా. నా రివ్యూను ఓ హీరో కించపరిచాడు. ప్రాబ్లంలేదు. కానీ మినిమమ్ రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడితే ప్రాబ్లమ్. ఒక సినిమాలో లీడ్ యాక్టర్‌గా చేస్తున్న వ్యక్తి..ఒక రెస్పాన్సిబుల్‌గా మాట్లాడాలి. కెమెరా, ఫ్లాట్ ఫాం దొరికిందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. నన్ను కించ పరిచే సమయంలో ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అని మాట్లాడాడు. అంటే రివ్యూస్ చెప్పేందుకు ఏమైనా కోర్సెస్ చేసి వస్తారా? న్యూయార్క్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో ఏమైనా కోర్సు ఉందా..? నేను నా ఒపెనియన్ చెప్పా. ఎవరికైనా చెప్పే హక్కు ఉంది’ అని పేర్కొన్నాడు నవీన్.

గతంలో ఎప్పుడైనా ఇలాంటి బెదిరింపులు వచ్చాయా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు యూట్యూబర్ మాట్లాడుతూ ‘ యాక్టర్స్ అలా చేయరు. ప్రొఫెషనల్‌గా ఉంటారు. కొంత మంది హీరోలు ముందే భయపడి.. నువ్వు నా సినిమాకు రివ్యూ ఇవ్వకు అని చెబుతారు. కొంత మంది పాజిటివ్ గా చెప్పమంటారు. కొంత మంది అస్సలు చెప్పకు నువ్వు.. అదే బెటర్ మాకు ఫోన్ చేస్తారు. నేను అన్నీ సినిమాలు ఎందుకు చూడాలి. అదీ కూడా నా ఇష్టం. నాకు చూడటం కూడా ఇంట్రెస్ట్ లేదు. అంటే అన్నీ మూవీస్ చూడను నేను. ఓ మూవీ చూడాలంటే ఇంట్రస్టింగ్ క్రియేట్ చేయాలి. అప్పుడే వెళతా ఆ సినిమాకి’ అని చెప్పారు నవీన్ నాయక్ అలియాస్ పూల చొక్కా. వీటితో పాటు పలు విషయాల గురించి చెప్పాడు.

Show comments