Aditya N
‘పాన్-ఇండియన్’ ప్రాజెక్ట్‌గా పేర్కొనబడిన ఈ చిత్రం మార్చి 28, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసింది. 173 నిమిషాల రన్‌టైమ్ తో U/A సర్టిఫికేట్‌తో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ముగించారు.
‘పాన్-ఇండియన్’ ప్రాజెక్ట్‌గా పేర్కొనబడిన ఈ చిత్రం మార్చి 28, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసింది. 173 నిమిషాల రన్‌టైమ్ తో U/A సర్టిఫికేట్‌తో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ముగించారు.
Aditya N
ఆడుజీవితం: ది గోట్ లైఫ్ అనేది మలయాళ సినీ పరిశ్రమ నుంచి ఈ ఏడాది వస్తున్న భారీ సినిమాల్లో ఒకటి. సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించారు. కాగా బెంజమిన్ రచించిన క్లాసిక్ మలయాళ నవల ఆడుజీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. బ్లెస్సీ రచన, దర్శకత్వంతో పాటు ఈ సినిమాకి సహనిర్మాతగా కూడా పని చేశారు. అమలా పాల్ మహిళా హీరోయిన్ గా నటించారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ది గోట్ లైఫ్ రన్ టైమ్ దాదాపు మూడు గంటలు కావడం విశేషం.
‘పాన్-ఇండియన్’ ప్రాజెక్ట్‌గా పేర్కొనబడిన ఈ చిత్రం మార్చి 28, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసింది. 173 నిమిషాల రన్‌టైమ్ తో U/A సర్టిఫికేట్‌తో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ముగించారు. దాదాపు మూడు గంటల పాటు సాగే సినిమా అంతే స్క్రీన్ ప్లే ఎంతో బాగుండాలి. ఏమాత్రం తేడా జరిగినా సినిమా బాగా సాగదీసారు అనే టాక్ వస్తుంది. అయితే ఇంటర్వ్యూలలో చూస్తే పృథ్వీరాజ్ తో పాటు చిత్ర బృందం ఈ సినిమా కథ ప్రేక్షకులని కట్టిపడేస్తుంది అని గట్టి నమ్మకంతో ఉన్నారు.
సౌదీ అరేబియాలోని ఎడారిలో ఇరుక్కుపోయిన మలయాళీ వలస కార్మికుడు నజీబ్ కథే ది గోట్ లైఫ్ సినిమా. వి ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేసిన ఈ చిత్రానికి ఆస్కార్ అకాడమీ, గ్రామీ అవార్డులు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు దర్శకుడు బ్లేస్సి పదేళ్ల పైనే కష్టపడి ఈ సినిమా తీశారు. ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత మాలీవుడ్ నుంచి మరో హిట్ సినిమాగా ది గోట్ లైఫ్ నిలుస్తుందని చెప్తున్నారు.