The Goat Twitter Review: దళపతి విజయ్ ది గోట్ ట్విట్టర్ రివ్యూ! సినిమా ఎలా ఉందంటే?

The Goat Twitter Review, Thalapathy Vijay: వెంకట్ ప్రభు డైరెక్షన్ లో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ది గోట్'. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని చూసిన ఫ్యాన్స్.. ట్విట్టర్ వేదిగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి ది గోట్ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

The Goat Twitter Review, Thalapathy Vijay: వెంకట్ ప్రభు డైరెక్షన్ లో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ది గోట్'. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని చూసిన ఫ్యాన్స్.. ట్విట్టర్ వేదిగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి ది గోట్ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గోట్’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ యాక్షన్ చిత్రం నేడు (సెప్టెంబర్ 5)న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్, ఫ్యాన్స్ షోలు పడిపోయాయి. దాంతో సినిమా ఎలా ఉందనే టాక్ బయటకి వచ్చేసింది. మూవీ చూసిన అభిమానులు టాక్ ఎలా ఉందో.. ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మరి ది గోట్ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది? విజయ్ హిట్ కొట్టాడా? అన్నది ఇప్పుడు చూద్దాం.

ది గోట్ మూవీ రిలీజ్ తో దళపతి విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమా చూసిన ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా మూవీ ఎలా ఉందో చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ అద్బుతంగా ఉందని, అందరి నుంచి పాజిటీవ్ టాక్ వస్తోందని, టైటిల్ కార్డుతోనే ప్రేక్షకులు పిచ్చెక్కిపోతారని అంటున్నారు. ఇక ఇందులో విజయ్ కాంత్ ఎంట్రీకి పూనకాలు వస్తాయట. ఏఐ సాయంతో విజయ్ కాంత్ ను ది గోట్ మూవీలో చూపించినట్లు తెలుస్తోంది. అలాగే.. ఫస్ట్ 12 నిమిషాలు అస్సలు మిస్ అవ్వొద్దని, దళపతి అండ్ ఇళయ దళపతి మధ్య ఫైట్ సీన్ చూసి తీరాల్సిందే అంటున్నారు. ఇక విజయ్ ఎంట్రీకి థియేటర్లు దద్దరిల్లిపోతున్నట్లు వీడియోలు చూస్తేనే తెలిసిపోతుంది.

ఇక సెకండాఫ్ స్టార్టింగ్ లో వచ్చే విజయ్ ఎలివేషన్ సీన్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయని చెబుతున్నారు. లయన్ ఈజ్ ఆల్వేస్ లయన్.. వెయిటింగ్ అని దళపతి చెప్పే డైలాగ్స్ కు థియేటర్లు షేక్ అవుతాయట. మెుత్తానికి ది గోట్ మూవీ విజయ్ ఫ్యాన్స్ కు ఓ ఫీస్ట్ లా ఉంటుందంటున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందని, విజయ్ ఫన్ సైడ్ ఈ మూవీతో చూడొచ్చని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. ఎంత యాక్షన్ ఉన్నాగానీ.. ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయని తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్తుందని చెప్పుకొస్తున్నారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు టేకింగ్ కు మంచి మార్కులే పడుతున్నాయి. చూడాలి మరి దళపతి విజయ్ ఏ రేంజ్ హిట్ కొడతాడో.

Show comments