Krishna Kowshik
1990లో వచ్చిన బాలీవుడ్ మూవీ ఆషికీ మంచి హిట్ కొట్టింది. ఇందులో పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా ఆషికీ-2 కూడా తెరకెక్కింది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే దీనికి సీక్వెల్ తెరకెక్కబోతుందంటూ వార్తలు వెలువడ్డాయి..
1990లో వచ్చిన బాలీవుడ్ మూవీ ఆషికీ మంచి హిట్ కొట్టింది. ఇందులో పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా ఆషికీ-2 కూడా తెరకెక్కింది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే దీనికి సీక్వెల్ తెరకెక్కబోతుందంటూ వార్తలు వెలువడ్డాయి..
Krishna Kowshik
సినిమాలు ఏవైనా హిట్ టాక్ తెచ్చుకోగానే.. వాటికి సీక్వెల్స్ తెరకెక్కించడం కామన్ అయిపోయింది. హాలీవుడ్ కల్చర్‌ను బాలీవుడ్ ఎడాప్ట్ చేసుకోవడంతో అక్కడ నుండి సౌత్ ఇండస్ట్రీకి పాకిపోయింది. అయితే ఈ సీక్వెల్స్‌లో కూడా కొత్తదనం చోటుచేసుకుంటుంది. తొలి సీజన్‌లో నటించిన హీరో హీరోయిన్లు.. మలి సినిమాలకు కనిపించడం లేదు. ధూమ్ సిరీస్ ఈ కోవకే వస్తుంది. ఇప్పుడు ఇదొక ట్రెండ్ అవుతోంది. ఆషికీ కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. 1990లో ఓ ఊపు ఊపేసిన లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా మూవీ ఆషికీ. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. అప్పట్లో ఈ మూవీ పాటల క్యాసెట్లు విపరీతంగా అమ్ముడు పోయాయి. ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మహేష్ భట్ దర్శకుడు.
దీనికి కొనసాగింపుగా ఆషికీ-2 కూడా వచ్చింది. 2013లో వచ్చిన ఈ మూవీ కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ధకపూర్ జోడీకి ఫిదా అయిపోయారు బాలీవుడ్ ప్రేక్షకులు. ఈ పిక్చర్ సాంగ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రానికి మరో సీక్వెల్ తెరకెక్కుతోందని వార్తలు వచ్చాయి. బాలీవుడ్ యంగ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్, జెన్నీఫర్ వింగేట్, యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారంటూ రూమర్స్ వచ్చాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలో ప్రారంభం అవుతుందని, ముఖేష్ భట్, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించనున్నారని బాలీవుడ్ కోడై కూసింది. అనురాగ్ బసు డైరెక్ట్ చేయబోతున్నాడంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
కాగా, ఈ రూమర్లపై స్పందించింది టీ- సిరీస్ సంస్థ. ‘టీ-సిరీస్ ప్రస్తుతం ఆషికీ 3 ప్రాజెక్టు డెవలప్ మెంట్, ప్రొడక్షన్ చేయడం లేదు. ఒక వేళ ఆషికీ 3 ప్రారంభిస్తే.. టీ సిరీస్, విశేష్ ఫిల్మ్- మహేష్ భట్ సంయుక్తంగా సినిమాను తెరకెక్కిస్తాయి. అలాగే ఆషికీ3ని మరో టైటిల్‌తో టీ-సిరీస్ నిర్మించనుందని వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. అలాగే అనురాగ్ బసు దర్శకత్వం వహించబోయే ఆషికీ 3.. మా ఫ్రాంచైజీలో భాగం కాదు. మాకు మద్దతు తెలుపుతున్న అభిమానులకు ధన్యవాదాలు. మేం మంచి కంటెంట్ ప్రేక్షకులకు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. మా పార్టనర్స్‌తో కలిసి భవిష్యత్తులో మంచి సినిమాలు అందించేందు ఎంతో ఆత్రుతగా ఉన్నాం’ అని క్లారిటీ ఇచ్చింది టీ సిరీస్.