Venkateswarlu
ప్రముఖ హీరోయిన్ నమిత భర్తకు పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక, ఇదే కేసుకు సంబంధించి ముత్తురామన్, దుశ్యంత్ యాదవ్‌లను పోలీసులు గతంతో అరెస్ట్ చేశారు...
ప్రముఖ హీరోయిన్ నమిత భర్తకు పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక, ఇదే కేసుకు సంబంధించి ముత్తురామన్, దుశ్యంత్ యాదవ్‌లను పోలీసులు గతంతో అరెస్ట్ చేశారు...
Venkateswarlu
ప్రముఖ హీరోయిన్ నమిత భర్త వీరేంద్ర చౌదరి ఓ చీటింగ్ కేసులో చిక్కుకున్నారు. దాదాపు 50 లక్షల రూపాయల మోసానికి సంబంధించిన కేసులో ఆయనకు తమిళనాడు సేలం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తమిళనాడు మైక్రో స్మాల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇప్పిస్తామంటూ ముత్తురామన్ అనే వ్యక్తి గోపాలస్వామి అనే వ్యక్తికి ఆశ చూపాడు. ఇందుకోసం గోపాలస్వామి దగ్గరి నుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు వసూలు చేశాడు.
అయితే, ఆ పదవిలోకి నమిత భర్త వీరేంద్ర చౌదరి వచ్చారు. దీంతో తాను మోసపోయానని భావించిన గోపాలస్వామి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కౌన్సిల్ సెక్రటరీ దుశ్యంత్ యాదవ్, ముత్తరామన్‌లను గత నెల 31వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఇదే కేసుకు సంబంధించి తాజాగా సేలం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు వీరేంద్రకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
కాగా, నమిత 2002లో వచ్చిన సొంతం సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో నమితకు వరుస అవకాశాలు వచ్చాయి. ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, జెమిని, ఐతే ఏంటి? తదితర సినిమాల్లో నటించారు. 2004లో వచ్చిన ‘‘ఎంగల్ అన్న’’ సినిమాతో తమిళ ఎంట్రీ ఇచ్చారు. 2006లో ‘‘లవ్ కే చెక్కర్‌మే’’ అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. తమిళంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు.
తమిళ అభిమానులు నమితకు ఏకంగా ఓ గుడినే కట్టారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఆమె ప్రముఖ వ్యాపారవేత్త వేరంద్ర చౌదరితో ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2017లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తిరుపతి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2022లో ఈ జంట ఓ బాబుకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన నమిత టీవీ షోలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. మరి, 50 లక్షల రూపాయల మోసం కేసుకు సంబంధించి నమిత భర్త వీరేంద్ర చౌదరికి పోలీసులు నోటీసులు ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.