సుహాస్ లేటెస్ట్ మూవీ జనక అయితే గనక రిలీజ్ పోస్ట్ పోన్.. కారణమిదే

Janaka Aithe Ganaka Movie Got Postponed: టాలీవుడ్ నటుడు సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ జనక అయితే గనుక.. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కు రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అంటూ.. ఓ పోస్ట్ ను రివీల్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా డీసెంట్ హిట్స్ తో దూసుకుపోతున్న హీరో సుహాస్. ఇప్పటికే ఈ హీరో నటించిన అన్ని సినిమాలు దాదాపు ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా సుహాస్ నటించిన మూవీ జనక అయితే గనక.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ.. సెప్టెంబర్ 7న థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఎలాగూ చిన్న సినిమాలు ఊహించని రెస్పాన్స్ సంపాదించుకోవడంతో.. ప్రేక్షకులలో ఈ సినిమాపై డీసెంట్ హైప్ నెలకొంది. దీనితో ఎలా అయినా ఈ వీకెండ్ ఈ సినిమాను చూడాలని ఫిక్స్ అయ్యారు మూవీ లవర్స్. కానీ ఇప్పుడు అది జరిగేలా లేదు. ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. “ఇప్పుడు వర్షాల మోత.. తర్వాత నవ్వుల మోతతో కలుద్దాం” అంటూ త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని పోస్ట్ చేశారు. ఇక కొత్త రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.

Show comments