Swetha
సింగిల్ సినిమాతో శ్రీ విష్ణు క్రేజ్ మరో లెవెల్ కు మారిపోయింది. వరుస హిట్స్ తో శ్రీ విష్ణు ఇండస్ట్రీలో తన స్థాయిని పెంచుకుంటున్నాడు. ఇక ఈ సినిమాతో అతను ట్యాగ్ లైన్ ఫిక్స్ అయిపోయింది.
సింగిల్ సినిమాతో శ్రీ విష్ణు క్రేజ్ మరో లెవెల్ కు మారిపోయింది. వరుస హిట్స్ తో శ్రీ విష్ణు ఇండస్ట్రీలో తన స్థాయిని పెంచుకుంటున్నాడు. ఇక ఈ సినిమాతో అతను ట్యాగ్ లైన్ ఫిక్స్ అయిపోయింది.
Swetha
టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు ఎంతో మంది హీరోలు వస్తూ ఉంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే నెగ్గుతారు. అలా కొన్నేళ్ల ముందు వరకు కూడా శ్రీ విష్ణు చిన్న స్థాయి హీరోలలో ఒకడిగా ఉండేవాడు. ఎదో అప్పుడప్పుడు ఒకటి రెండు హిట్స్ కొట్టేవాడు. కానీ ఇప్పుడు శ్రీవిష్ణు రేంజ్ మారిపోయింది. సినిమాలో కథ కథనం ఎలా ఉన్నా సరే అందులో శ్రీ విష్ణు ఉన్నాడంటే అది హిట్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో శ్రీ విష్ణు తన స్టామినాను చూపిస్తున్నాడు. పైగా వరుస హిట్స్ తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు శ్రీ విష్ణు. ముఖ్యంగా యూత్ తన సినిమాలను బాగా ఇష్టపడుతున్నారు.
లేటెస్ట్ గా రిలీజ్ అయిన సింగిల్ మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. కథలో అక్కడక్కడా లోపాలు ఉన్నా సరే సినిమా గురించి మాత్రం అంతా పాజిటివ్ గానే మాట్లాడుకుంటున్నారు. శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ , వన్ లైన్ పంచ్ లు ఇలా అతని గురించి బాగా చెప్తున్నారు. ఈ సినిమా హిట్ అయిందంటే దానికి కారణం కేవలం శ్రీవిష్ణునే అని చెప్పి తీరాల్సిందే. సాధారణంగా పెద్ద పెద్ద స్టార్స్ కు అప్ కమింగ్ హీరోలకు పేరు వెనుక ఎదో ఒక బిరుదు ఉంటుంది. ఇక కొందరికి అభిమానులు పెడుతూ ఉంటారు.. మరికొందరికి ఆ సినిమా వాళ్ళే పెడుతూ ఉంటారు. అది ఏదైనా సరే ప్రేక్షకులను కన్విన్స్ చేసే విధంగా ఉంటే మాత్రం మార్కెట్ లో ఆ హీరో ఆ ట్యాగ్ లైన్ తో పాపులర్ అవుతాడు. ఉదాహరణకు భలే భలే మగాడివోయ్ సినిమా సమయంలో నాని కి న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. దానిని ప్రేక్షకులంతా ఒప్పుకున్నారు. ఇలా ఇప్పుడు సింగిల్ మూవీలో శ్రీ విష్ణు కి కింగ్ అఫ్ ఎంటర్టైన్మెంట్ అని ట్యాగ్ లైన్ వేశారు. సినిమా చూసిన వారంతా కూడా శ్రీ విష్ణుని నిజంగానే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని అంటున్నారు. సో ఇక నుంచి ఈ ట్యాగ్ లైన్ కు న్యాయం చేయాల్సిన భాద్యత శ్రీ విష్ణుదే. ఇక లాంగ్ రన్ లో సింగిల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.