Squid Game Season 2: స్క్విడ్ గేమ్ సీజన్ 2 పై బిగ్ అప్డేట్! స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Squid Game Season 2: స్క్విడ్ గేమ్ సీజన్ 2 పై బిగ్ అప్డేట్! స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

స్క్విడ్ గేమ్ సీజన్ 2కు సంబంధించి బిగ్ అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుందంటే?

స్క్విడ్ గేమ్ సీజన్ 2కు సంబంధించి బిగ్ అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుందంటే?

‘స్క్విడ్ గేమ్’.. 2021లో వచ్చిన ఈ కొరియన్ వెబ్ సిరీస్ ప్రపంచం మెుత్తాన్ని ఉర్రూతలూగించింది. మూడేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ ల్లో టాప్ లో నిలిచింది. ఇక సీజన్ 1 సాధించిన భారీ విజయంతో.. సీజన్ 2 శ్రీకారం చుట్టారు మేకర్స్. తాజాగా సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుందంటే?

‘స్క్విడ్ గేమ్’ సీజన్ 2 కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మేకర్స్ వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ వేస్తూ.. సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. హ్వాంగ్ డాంగ్ హ్యూక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇందుకు సంబంధించి ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. తొలి సీజన్ లాగే తెలుగు డబ్బింగ్ కూడా ఉండనుంది. దీంతో పాటుగా వచ్చే సంవత్సరం అంటే 2025లో సీజన్ 3 తీసుకొస్తామని, అలాగే ఈ సిరీస్ కు ముగింపు పలుకుతామని తెలిపింది.

కాగా.. స్క్విడ్ గేమ్ సీజన్ 1ను 9 ఎపిసోడ్స్ తో తీశారు. 2021లో వచ్చిన ఈ సిరీస్ మూవీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. క్షణక్షణం ఉత్కంఠ రేపే సీన్స్ తో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఉర్రూతలుగించింది. అప్పట్లో మోస్ట్ పాపులర్ సిరీస్ గా నిలిచింది. చిన్న చిన్న గేముల్లో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కంటెస్టెంట్స్ చేసే పోరాటాలు ఇందులో ఆకట్టుకుంటాయి. ఇక ఇప్పుడు సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ కావడంతో.. అభిమానులు సంబరపడిపోతున్నారు. మరి మీలో ఎంత మంది స్క్విడ్ గేమ్ సీజన్ 2 కోసం ఎదురుచూస్తున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments