Prabhas: అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్టకు ప్రభాస్‌కు ప్రత్యేక ఆహ్వానం!

అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు.

అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు.

అయోధ్య రామాలయంలో శ్రీరామ చంద్రుడి ప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. జనవరి 22వ తేదీన శ్రీరాముడు గుడిలో కొలువు దీరనున్నాడు. అయ్యోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరిలో సినీ రంగానికి చెందిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు చాలా మందికి ఆహ్వానాలు వెళ్లాయి.

టాలీవుడ్‌లో మొదటి ఆహ్వానం మెగాస్టార్‌ చిరంజీవికి అందినట్లు తెలుస్తోంది. తాజాగా ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. ఇక, ఇతర చిత్ర రంగాలనుంచి రజినీకాంత్‌, మోహన్‌లాల్‌, రిషబ్‌ శెట్టి, ధనుష్‌, యశ్‌, రణబీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, అజయ్‌ దేవగణ్‌, సన్నీ డియోల్‌లకు ఆహ్వానం అందింది. అంతేకాదు! హనుమాన్‌ చిత్ర బృందం మొత్తానికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇక, ప్రతిష్టకు ముందు అయోధ్యలో కొన్ని యాగాలు, యజ్ఞాలు జరగనున్నాయి.

జనవరి 16నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 7000 మంది అతిధులతో పాటు 4000 మంది సాధువులకు కూడా ఆహ్వానం అందింది. ​కాగా, ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ అనే సినిమాలో రాముడి పాత్రలో కనిపించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. సీతగా.. కృతీ సనన్‌, రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. భారీ అంచనాల నడుమ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2023, జూన్‌ 16వ తేదీన విడుదల అయింది.

అయితే, ఆశించిన స్థాయిలో సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. అయినప్పటికి మొదటి రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఆదిపురుష్‌ తర్వాత ప్రభాస్‌ తాజాగా సలార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్‌ 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ప్రేక్షకులతో పాటు రివ్యూవర్లను కూడా మెప్పించింది. మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. సలార్‌ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 178 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది.

నాలుగు రోజుల్లో 400లకు పైగా కోట్ల రూపాయల వసూల్ని సాధించింది. ఓవర్‌సీస్‌లో అయితే, ప్రభాస్‌ మ్యానియా కనిపిస్తోంది. మూవీ ఇప్పటి వరకు 80 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఓవర్‌సీస్‌ కింగ్‌ షారుఖ్‌ ఖాన్‌ రికార్డులకే చెక్‌ పెట్టింది. డంకీ మూడు రోజుల్లో కేవలం 215 కోట్లు మాత్రమే కలెక్ట్‌ చేసింది. సలార్‌కు ఏ విషయంలోనూ పోటీ రాలేకపోయింది. మరి, అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రతిష్టకు ప్రభాస్‌కు ప్రత్యేక ఆహ్వానం అందటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments