కిస్సిక్ సాంగ్ లో ఇంత మీనింగ్ ఉందా !

Kissik Song : పుష్ప 2 సినిమా అంతా ఒక రేంజ్.. సినిమాలో ఐటెం సాంగ్ ఒక రేంజ్. ఈ సాంగ్ ఎలా ఉంటుంది? మళ్ళీ ఏ హీరోయిన్ నటిస్తుంది? సమంత ను రీప్లేస్ చేస్తుందా లేదా? అబ్బో ఇలా చాలానే డిస్కషన్ జరిగింది. కట్ చేస్తే 'దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయిరో'.. అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Kissik Song : పుష్ప 2 సినిమా అంతా ఒక రేంజ్.. సినిమాలో ఐటెం సాంగ్ ఒక రేంజ్. ఈ సాంగ్ ఎలా ఉంటుంది? మళ్ళీ ఏ హీరోయిన్ నటిస్తుంది? సమంత ను రీప్లేస్ చేస్తుందా లేదా? అబ్బో ఇలా చాలానే డిస్కషన్ జరిగింది. కట్ చేస్తే 'దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయిరో'.. అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

పుష్ప 2 సినిమా అంతా ఒక రేంజ్.. సినిమాలో ఐటెం సాంగ్ ఒక రేంజ్. ఈ సాంగ్ ఎలా ఉంటుంది? మళ్ళీ ఏ హీరోయిన్ నటిస్తుంది? సమంత ను రీప్లేస్ చేస్తుందా లేదా? అబ్బో ఇలా చాలానే డిస్కషన్ జరిగింది. కట్ చేస్తే ‘దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయిరో’.. అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒకటే మ్యూజిక్. మొదట ఓకే ఓకే ఊ అంటావా అంత కాకపోయినా పర్లేదు… అన్నవారే ఇప్పుడు ఈ సాంగ్ కు తెగ వైబ్ అవుతున్నారు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు.. ఐటెం సాంగ్స్ నందు సుకుమార్ ఐటెం సాంగ్స్ వేరయా అనే డేస్ వచ్చేశాయేమో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో సాంగ్ ఒక ఊపు ఊపేస్తోంది. సుకుమార్ ఎంతో వేటాడి వేటాడి ఫైనల్ గా శ్రీలీలను ఎంపిక చేశాడు. ఆ కష్టం ఊరికే పోలేదు. శ్రీలీల ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజన్స్ అందరిని కట్టిపడేస్తుంది. వాయు వేగంతో మాస్ లోకి కిస్సిక్ దూసుకుపోతుంది.

ఇక ఈ సాంగ్ ను చంద్రబోస్ రచించిన సంగతి తెలిసిందే. మొదటి సారి ఈ సాంగ్ విన్నప్పుడే చంద్రబోస్ ఎదో కొత్త ప్రయోగం చేశారని అంతా భావించారు. అది వాస్తవమే చంద్రబోస్ చేసింది కేవలం ప్రయోగం మాత్రమే కాదు.. ఆ లిరిక్స్ లో కొన్ని రకాల ట్రెండింగ్ అంశాలు జోడించి ఓ మెసేజ్ ను కూడా ఇచ్చారు. బ్యాడ్ టచ్ , డీప్ ఫేక్ , మార్ఫింగ్ లాంటి అంశాలపై రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇదే పాయింట్ ను బేస్ చేసుకుని చంద్రబోస్.. సుకుమార్, DSP లు కలిసి కిస్సిక్ సాంగ్ ను రెడీ చేశారు. పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు రాసుకుంటే.. కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ చేశారో.. కానీ ఫేసెస్ గీసులు మార్ఫింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో.. దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయిరో లాంటి లైన్స్ అన్ని కూడా.. సోషల్ ఇష్యూస్ మీద సెటైర్ వేసినట్లే ఉన్నాయని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

ఈ లైన్స్ తో సాంగ్ కు మంచి హైప్ వచ్చిన మాట వాస్తవమే. చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో అమ్మాయిల ఫోటోల మార్ఫింగ్ లు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఎంతో మంది ఎన్నో రకాలుగా అవైర్నెస్ తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ అలాంటి సంఘటనలు పదే పదే జరుగుతూ ఉన్నాయి. సో వీటి అన్నిటిని దృష్టిలో ఉంచుకుని చంద్రబోస్ ఈ సాంగ్ ను రాసి ఉంటారని భావిస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా ఈ సాంగ్ ఓ వైపు కమర్షియల్ గా సక్సెస్ అందుకుంటూనే.. మరో వైపు సెటైరికల్ గా మెసేజ్ ను అందించినట్లు అయింది. ప్రస్తుతం ఈ సాంగ్ ఫుట్ ట్యాపింగ్ ట్యూన్స్ – ఆకట్టుకునే సాహిత్యం తో మోత మోగిపోతుంది. రానున్న రోజుల్లో ఇంకాస్త వైరల్ అవ్వతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments