ఒక్కోసారి ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ ఊహించని విధంగా సాగుతుంటుంది. వాళ్లు పుట్టి పెరిగి.. ఏ భాషలో సక్సెస్ అవ్వాలని అనుకుంటారో.. అక్కడ తప్ప మిగతా అన్ని భాషల్లో సక్సెస్ అవుతుంటారు. ప్రస్తుతం తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ కెరీర్ అలాగే సాగుతోంది. ఆమె తెలుగులో తప్ప బాలీవుడ్ లో, కోలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. కానీ.. తెలుగులో మేజర్ సినిమా లాస్ట్. అందులోనూ చిన్న పాత్ర. ఆ తర్వాత తెలుగులో ఒకటంటే ఒక ప్రాజెక్ట్ లో కూడా కనిపించలేదు. అలాగని ఇప్పుడు కూడా శోభిత చేతిలో తెలుగు సినిమాలేం లేవు. చేతిలో సితార అనే హిందీ మూవీతో పాటు ‘మంకీ మ్యాన్’ అనే మూవీ చేస్తోంది.
వైజాగ్ కి చెందిన శోభిత.. మోడలింగ్ ద్వారా సినిమాల్లో అడుగు పెట్టింది. మొదట 2016లో రామన్ రాఘవ మూవీతో బాలీవుడ్ డెబ్యూ చేసింది. అక్కడినుండి వరుసగా హిందీలోనే సినిమాలు చేస్తూ.. తెలుగులో గూఢచారి సినిమాతో తెలుగులో మెరిసింది. ఆ తర్వాత నాలుగేళ్లకు మేజర్ లో చిన్న రోల్ చేసింది. కానీ.. హీరోయిన్ గా మాత్రం తెలుగులో అవకాశాలు అందుకోలేకపోతోంది అమ్మడు. పైగా గ్లామర్ పరంగా.. బోల్డ్ రోల్స్ పరంగా ఏమాత్రం మొహమాటం లేకుండా చేసేందుకు రెడీ అంటోంది. కాగా.. రీసెంట్ గా హిందీలో ‘ది నైట్ మేనేజర్’ అనే వెబ్ సిరీస్ చేసింది. అందులో యంగ్ హీరోతో పాటు వయసుపైబడిన సీనియర్ యాక్టర్స్ తో లిప్ లాక్స్, బెడ్ సీన్స్ చేసి షాకిచ్చింది.
తెలుగు ప్రేక్షకులను చివరిగా మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ మూవీలో నటించింది. అదికూడా డబ్బింగ్ రూపంలో తెలుగులో విడుదలైంది. అలా పరాయి భాషలలో సక్సెస్ అవుతున్న శోభిత.. తెలుగులో ఆశించిన స్థాయిలో కెరీర్ సాగట్లేదు. ఎందుకంటే.. సినిమాల్లోకి వచ్చిన ఏడు సంవత్సరాలలో కేవలం రెండే తెలుగు సినిమాలు చేయడం గమనార్హం. ఆ రెండు అడివి శేష్ తోనే చేయడం విశేషం. ఇదిలా ఉండగా.. శోభిత రీసెంట్ గా కపిల్ శర్మ షోలో పార్టిసిపేట్ చేసింది. ఈ సందర్భంగా తన గురించి ఆసక్తికర విషయాలు చెబుతూ.. ఎడ్యుకేషన్ పూర్తయ్యాక నా ఛాయస్ బెంగుళూరు, ముంబై ఈ రెండే. అయితే.. ఈ రెండింటిలో ఎక్కడికి వెళ్లాలని అనుకున్నప్పుడు.. కాయిన్ తో టాస్ వేస్తే..ముంబై ఛాయస్ గా వచ్చింది. అలా నా కెరీర్ టర్నింగ్ పాయింట్ కి ముంబై కారణం అని చెప్పుకొచ్చింది అమ్మడు. మరి శోభిత గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.