Krishna Kowshik
తన గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన సింగర్ మనో.. తన కొడుకుల వల్ల అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఇద్దరు కుమారుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
తన గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన సింగర్ మనో.. తన కొడుకుల వల్ల అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఇద్దరు కుమారుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
Krishna Kowshik
సింగర్ నాగూర్ బాబు అలియాస్ మనో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాటలతో సినీ ప్రేక్షకులను అలరించాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో లెక్కలేనన్నీ పాటలు పాడారు. ఆయన సేవలకు గానూ అమెరికాకు చెందిన రిచ్మండ్ గాబ్రియేల్ యూనివర్సిటీ డాక్టరేట్ అందించింది. కేవలం సింగర్ మాత్రమే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత, అప్పుడప్పుడు నటుడు కూడా. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నా.. ఎప్పుడు కాంట్రవర్సీలో చిక్కుకోలేదు. ఇప్పుడు ఆయన పిల్లల వల్ల మనో పేరు బయటకు వచ్చింది. మనోకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్న సంగతి విదితమే.
ఓ గొడవ విషయంలో కొడుకులు షకీర్, రఫీ అలియాస్ రతీష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అసలు ఏం జరిగిందంటే..? చెన్నైలోని ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్, మధురవాయల్‌కి చెందిన 16 ఏళ్ల కుర్రాడు.. శ్రీదేవి కుప్పంలోని ఫుట్‌బాల్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. గత మంగళవారం రాత్రి శిక్షణ పూర్తి చేసుకున్నాక.. డిన్నర్ నిమిత్తం వలసరవాక్కంలోని ఓ హోటల్‌కి వెళ్లారు. అదే సమయంలో మనో సింగర్ కుమారులు షరీఫ్, రఫీ.. తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో అక్కడకు వచ్చారు. మద్యం మత్తులో ఉన్న ఈ ఐదుగురు కృపాకరన్‌తో గొడవ పడ్డారు. అతడ్ని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. అక్కడి వారు అడ్డుకుంటున్నప్పటికీ తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన కృపాకరన్‌ని స్థానికులు కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్రత్రిలో చేర్చారు.
కృపాకరన్ పోలీసులకు వారిపై ఫిర్యాదు చేశాడు. సింగర్ మనో కుమారులు సహా వారి స్నేహితులపై పోలీసు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తొలుత ఇదర్ని అరెస్టు చేశారు. మనో కుమారులు పరారయ్యారు. దీంతో మనో మేనేజర్, ఇంటి పనిమనిషిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారించారు. ఎట్టకేలకు సింగర్ కొడుకులు షకీర్, రఫీలను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇప్పటి వరకు వివాద రహితుడిగా ఉన్న గాయకుడు సింగర్ కొడుకుల వల్ల అవమానం ఎదుర్కొవాల్సిన పరిస్థితి. ఇందులో షకీర్.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2012లో వచ్చిన తమిళ చిత్రం నాన్గా చిత్రంలో నటించాడు. అరెస్టైన రఫీ, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మా, జహీర్‌లపై హత్య బెదిరింపు, దాడి, అసభ్యంగా ప్రవర్తించడం వంటి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.