అరుదైన గౌరవం దక్కించుకున్న స్టార్ సింగర్ మంగ్లీ!

Singer Mangli Got a Rare Honor: బుల్లితెరపై తనదైన యాస, పాటలతో తెగులు ప్రేక్షకుల మనసు దోచిన సింగర్ మంగ్లీ గురించి తెలియని వారు ఉండారు. ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు.. రివార్డులు గెల్చుకుంది.

Singer Mangli Got a Rare Honor: బుల్లితెరపై తనదైన యాస, పాటలతో తెగులు ప్రేక్షకుల మనసు దోచిన సింగర్ మంగ్లీ గురించి తెలియని వారు ఉండారు. ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు.. రివార్డులు గెల్చుకుంది.

ప్రముఖ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎస్‌వీ విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక సంగీతంలో డిప్లమా చేసింది. యాంకర్ గా కెరీర్ ప్రారంభించింద. ఓ ప్రముఖ ఛానల్ ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా దగ్గరయ్యింది. అప్పటి వరకు సత్యవతి రాథోడ్ గా ఉన్న ఆమె పేరు ఆ ఛానల్ ద్వారా మంగ్లీగా మారింది. ఈ పేరుతో మంగ్లీ విపరీతమైన క్రేజ్ సంపాదించింది. తన యాస, పాటల ద్వారా తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. తెలంగాణ బతుకమ్మ పాటలు ఇతర ఫోక్స్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ఆమె పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే..

బుల్లితెర, వెండి తెరపై నటి, సింగర్, యాంకర్ గా అన్ని రంగాల్లో తనదైన మార్క్ చాటుకుంటుంది మంగ్లీ. ఈమె అసలు పేరు సత్యవతి రాథోడ్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరు మంగ్లీగా మార్చుకుంది. సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతున్న మంగ్లీ మరోవైపు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతుంది. చిన్నప్పటి నుంచి సింగర్ ఎదగాలనే ఆమె కోరికను తండ్రి, ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతోనే కర్ణాటక సంగీతంలో డిప్లమా చేసి మంచి సింగర్ గా ఎదిగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫాక్ సాంగ్ అంటే వెంటనే మంగ్లీ గుర్తుకు వచ్చేలా క్రేజ్ సంపాదించింది. ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘అలా వైకుంఠపురములో’మూవీలో రాములో రాములా పాటకి మంచి మార్కులు పడ్డాయి.

సింగర్ మంగ్లీ ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు, రివార్డులు గెల్చుకుంది. ఈ క్రమంలోనే మంగ్లీ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఇటీవల స్వధా ఫౌండేషన్ నిర్వహించిన ‘మార్గా 2024’ కార్యక్రమంలో ఉషా ఉతుప్, సుధా రఘునాథన్ లాంటి గాయకులతో కలిసి మంగ్లీ వేధిక పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె సంగీత ప్రపంచంలో సాధించిన విజయాలకు గాను సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ యువ పురస్కారానికి ఎంపికైంది. ఈ విషయం తెలిసిన అభిమానులు, తోటి కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ముందు ముందు మరిన్ని అవార్డులు, పురస్కారాలు అందుకోవాలని మనసారా కోరుకుంటున్నారు.

Show comments