మహారాజకి విజయ్ సేతుపతి రెమ్యూనరేషనే తీసుకోలేదు! కానీ.. కోట్లలో లాభం!

Maharaja: విజయ్ సేతుపతి నటించిన రీసెంట్ మూవీ మహారాజ. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వార్తల్లో నిలుస్తుంది. ఈ మూవీ కోసం

Maharaja: విజయ్ సేతుపతి నటించిన రీసెంట్ మూవీ మహారాజ. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వార్తల్లో నిలుస్తుంది. ఈ మూవీ కోసం

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్న కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి. కంటెంట్ ఉన్న వాడికి హ్యాండ్సమ్ లుక్, ఫిట్నెస్ బాడీ ఉండనక్కర్లేదని నిరూపించిన హీరో. కేవలం హీరో ఇమేజ్‌కు కట్టుబడిపోలేదు. విలన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అలరిస్తున్నాడు. దక్షిణాది పరిశ్రమను చుట్టేసిన అతడు.. బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మేరీ క్రిస్మస్, మహారాజ చిత్రాలతో పలకరించాడు. ఇందులో మహరాజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. జూన్ 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ భారీ కలెక్షన్లను అందుకుంది. రూ. 20 కోట్ల పెట్టి సినిమా తీస్తే.. సుమారు రూ. 110 కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకుంది. ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూస్ రాబట్టుకుంటుంది.

అయితే ఈ సినిమాలో నటించేందుకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేద విజయ్ సేతుపతి. ఇక ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు కానీ కథ కీ రోల్ ప్లే చేసింది. ఇందులో సెలూన్ షాపులో పనిచేసే బార్చర్‌గా ఆకట్టుకున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్. కూతురు అంటే పంచ ప్రాణాలతో బతికే అతడు పోలీసుల దగ్గర చేసే డ్రామా, విలన్ల కోసం అతడు వేసే ప్లాన్ ఈ మూవీకి హైలెట్. లైంగిక వేధింపుల గురించి ఈ మూవీలో చూపించాడు దర్శకుడు నితిలన్ స్వామి నాథన్. ఈ మూవీని కేవలం రూ. 20 కోట్లు పెట్టి తెరకెక్కించారు సుధన్ సుందరం, జగదీష్ పళని స్వామి. ఇంతే బడ్జెట్‌తో సినిమా తీస్తామని నిర్మాతలు విజయ్ సేతుపతికి చెప్పగా ఓకే చెప్పారట. లాభాల్లో వాటా ఇస్తామని చెప్పారట. దీనికి ఓకే చెప్పాడట విజయ్.

ఇప్పుడు 20 కోెట్ల రూపాయలను పెట్టి సినిమా తీస్తే భారీ హిట్ అందుకోవడమే కాదు వసూళ్లను రాబట్టుకుంది. ఈ లెక్కన చూస్తే.. ఈ మూవీకి రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. సాధారణంగా విజయ్ సేతుపతి సాధారణంగా ఒక్కో మూవీకి రూ. 10-12 కోట్లు తీసుకుంటాడని టాక్ నడుస్తుంది. కానీ లాభాల్లో షేర్ తీసుకుంటున్నట్లయితే ఇప్పుడు ఆయనకు భారీగా ముట్టనున్నట్లు తెలుస్తుంది. దీంతో నక్కతోక తొక్కినట్లయ్యింది. ఇక విజయ్ సేతుపతి మూవీల విషయానికి వస్తే.. గాంధీ టాక్స్ అనే మూవీతో పాటు విడుదలై పార్ట్ 2లో నటించబోతున్నాడని తెలుస్తుంది. అలాగే ఫర్జీ వెబ్ సిరీస్ మూవీతో బాలీవుడ్ బాట పట్టిన ఈ వర్సటైల్ నటుడు.. ఇప్పుడు మరికొన్ని కథలను వింటున్నట్లు తెలుస్తుంది.

Show comments