Dharani
Dharani
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావడం ఎంత కష్టమో.. వచ్చిన దాన్ని.. నిలుపుకుని.. దాన్ని కొనసాగించడం అంతకంటే కష్టం. వ్యసనాలు, మోసాలు అన్ని చోట్ల ఉంటాయి.. కానీ ఇండస్ట్రీలో ఇవి కాస్త ఎక్కువ. పొగుడుతున్నారు కదా అని.. పొంగిపోతే ఇక అంతే సంగతి. ఇక కెరీర్‌లో ఎంతో ఎత్తుకు ఎదిగి.. వ్యసనాల కారణంగా జీవితంలో అన్ని కోల్పోయి.. రోడ్డు మీద పడ్డ వారు ఎందరో ఉన్నారు. ఇండస్ట్రీలో మద్యం కారణంగా జీవితాలను నాశనం చేసుకున్న వారిలో ముందుగా వినిపించే పేర్లు సావిత్ర, సీనియర్ నటి ఊర్వశి అని చెబుతారు. మద్యం కారణంగా ఊర్వశి కెరీర్ నాశనం అయ్యిందని చెబుతారు. హీరోయిన్‌గా.. స్టార్ హీరోలందరి సరసన నటించిన ఊర్వశి కెరీర్.. మద్యపానం కారణంగా ముగిసి పోయిందని చెబుతున్నారు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ.. ప్రాణంగా ప్రేమించి.. పెళ్లి చేసుకున్న భర్తే.. తన జీవితాన్ని నాశనం చేశాడని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..
ఈ సందర్భంగా ఊర్వశి మాట్లాడుతూ.. ‘‘హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక.. అందరూ స్టార్ హీరోలందరి సరసన నటించాను. ఇలా ఉండగా.. మనోజ్ కె. జయన్‌తో పరిచయం అయ్యింది. అది కాస్త ప్రేమగా మారింది. దాంతో 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నాం. అయితే వాళ్లింట్లో అందరికి మద్యం సేవించే అలవాటు ఉంది. కుటుంబం మొత్తం ఒకే చోట కూర్చుని.. మందు తాగేవారు. నేను వెళ్లాక.. తాగమని నన్ను కూడా బలవంతం చేశారు. అలా మొదటిసారి తాగాను. ఆతర్వాత అది నాకు ఒక వ్యసనంలా మారింది. కొన్నాళ్లకు నేను తాగుతాను అనే కారణం చెప్పి.. జయన్ నాకు విడాకులు ఇచ్చాడు. అంతేకాక నా బిడ్డను నాకు కాకుండా చేశారు. నేను మద్యానికి బానిసనయ్యానని.. బిడ్డను సరిగ్గా పెంచలేను అని.. నా కుమార్తె బాధ్యతను కూడా వారే తీసుకున్నారు’’ అని చెప్పుకొచ్చింది.
‘‘ఇవన్ని చూశాకా.. నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఒంటరిదానిగా మిగిలిపోయాను. ఆ సమయంలో నా ఫ్యామిలీ ఫ్రెండ్ శివ ప్రసాద్ నాకు అండగా నిలిచాడు. అలా 40 ఏళ్ల వయసులో నేను ఆయనను వివాహం చేసుకున్నాను. అప్పుడు నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ వయస్సులో పెళ్లి ఏంటి అని చాలా మంది నన్ను విమర్శించారు. కానీ నేను వాటిని పట్టించుకోలేదు. ప్రస్తుంత నా భర్త, కొడుకుతో ఎంతో సంతోషంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది ఊర్వశి. ప్రస్తుతం ఆమె మాటలు ఫిల్మ్ నగర్‌లో వైరల్‌గా మారాయి.