ఈ యువతిని గుర్తుపట్టారా..? హీరోయిన్ అయ్యాక జూనియర్ సావిత్రిలా పేరు తెచ్చుకుంది!

ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తు పట్టారా..? రియల్ పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్. ఆమె పేరు చెబితే.. తండ్రి, తాతలు కథలు కథలుగా చెబుతారు ఆమె నటన గురించి. ఇప్పటి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమె సొంతం. సింపుల్ అంట్ క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తు పట్టారా..? రియల్ పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్. ఆమె పేరు చెబితే.. తండ్రి, తాతలు కథలు కథలుగా చెబుతారు ఆమె నటన గురించి. ఇప్పటి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమె సొంతం. సింపుల్ అంట్ క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న ఆమె ఎవరంటే..?

గ్లామరస్ పాత్రలే నటీమణులను.. స్టార్ హీరోయిన్లుగా నిలబెడుతుంటాయి. అందుకే ఎక్స్ పోజింగ్ పాత్రలకు అడ్డు చెప్పరు యాక్ట్రెసెస్.  కథ, దర్శకుడు డిమాండ్ చేస్తే బికినీకి కూడా సై అంటుంటారు. చీరలతో ఆకట్టుకునే స్వరూపం సావిత్రి కాలంతోనే పోయింది. అదీ కూడా పెళ్లైతే ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోతుంటాయి. హీరోయిన్ మెటీరియల్ కాదని పక్కన పెట్టేస్తారు. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావు. కానీ ఇవన్నీ కూడా వర్తించవు ఈ సీనియర్ నటి విషయంలో. నిజం చెప్పాలంటే.. చీర కట్టుతోనే సినిమాల్లో అలరించింది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. మలయాళ కుట్టీ అయిన పదాహరణాల తెలుగు అమ్మాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. దక్షిణాది ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది ఈ ధ్రువ తార.

కట్టు, బొట్టుతో పాటు నటన కారణంగా ఆమెను తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు. ఆమెకు ముఖంపై ఉంటే పుట్టుమచ్చ ప్రధాన ఆకర్షణ. పెళ్లి అయిన తర్వాత కూడా ఆమె హీరోయిన్‌గా యాక్ట్ చేసి.. టాప్ హీరోయిన్ అయ్యింది. ఆమె మరణించడానికి కొన్ని ఏళ్ల ముందు వరకు సినిమాలు చేస్తూనే ఉంది. ఇంతకు ఆ సీనియర్ నటి ఎవరంటే.‘కొమ్మ కొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉన్నాయి’ పాట గుర్తు చేస్తే చెప్పగలరు కదా.. ఆమె మరెవ్వరో కాదూ.. సీనియర్ యాక్ట్రెస్. అమ్మ, అమ్మమ్మ తరం ఎంతో ఇష్టపడిన గోల్టెన్ హీరోయిన్ సుజాత. సుజాత మలయాళ పేరెంట్స్‌కు శ్రీలంకలో జన్మించింది. ఆ తర్వాత కేరళకు వచ్చి స్థిర పడింది ఈ కుటుంబం. తపస్విని అనే మలయాళ చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన సుజాత..నాలుగేళ్లలో సుమారు 40 చిత్రాలు చేసి టాప్ హీరోయిన్ అయిపోయింది.

ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి.. సత్తా చాటుకుంది ఈ నటి. 1977లో జయకర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది సుజాత. పెళ్లైనప్పటికీ ఆమె సినిమాలు చేయడం ఆపలేదు. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడే ఆమెకు ఎక్కువ ఆఫర్లు రావడంతో పాటు తెలుగులోనూ తన హవా కొనసాగించింది. 1979లో బైలింగ్వల్ మూవీ గుప్పెడంత మనస్సు చిత్రంలో ఎంట్రీ ఇవ్వగా.. ఆమెను తెలుగు వారికి దగ్గర చేసిన సినిమా మాత్రం..శోభన్ బాబు చిత్రం గోరింటాకు. స్వప్న పాత్రలో ఇప్పటికీ గుర్తిండిపోతుంది. సీనియర్ నటి సావిత్రి చివరి సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక అక్కడ నుండి తెలుగులో గుర్తుండిపోయే పాత్రలు దక్కించుకుంది సుజాత. చివరకు జూనియర్ సావిత్రి అన్న పేరు కూడా వచ్చింది. హిందీలో కూడా వేళ్లపై లెక్కపెట్టే సినిమాలు చేసిందావిడ.

ఏడంతస్థుల మేడ, సంధ్య, బెబ్బుల్లి, సర్కర్ రాముడు, ప్రేమ తరంగాలు, గరు శిష్యులు, ప్రణయ గీతం, పండంటి జీవితం, బంగారు కానుక, బహుదూరపు బాటసారి వరకు అనేక సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాయి. ఆ తర్వాత కూడా ఆమె తల్లిగా మారి.. అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలకు తల్లిగా మారింది. అభిలాష, జస్టిస్ చక్రవర్తి, అనుబంధం, అగ్ని గుండం, సూత్రధారులు, చంటి, కొండ పల్లి రాజా, ధర్మరాజు ఎంఎ, బిగ్ బాస్, ఆటో డ్రైవర్ వంటి చిత్రాల్లో నటించింది. 80-2000 లోపు కిడ్స్ కు ఆమె పెళ్లి సినిమాతో గుర్తిండిపోతుంది. అందులో కోడలిని కూతురిలా భావించి, స్వయంగా కొడుక్కి విషం పెట్టిన తల్లిగా గుర్తిండిపోయే పాత్రలో మెప్పించింది ఆవిడ. స్నేహం కోసం, శ్రీ రామదాసు, నీకు నేను నాకు నువ్వు వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. 2011లో ఇదే రోజున అంటే ఏప్రిల్ 6న ఆమె కన్నుమూసింది. ఆమె చనిపోయి 13 ఏళ్లు అవుతున్నా.. మన తండ్రి, తాతల తరం నాటి వారికి ఆమె ఫేవరేట్ హీరోయిన్నే.

Show comments