ట్రాక్ మార్చుకుంటున్న డైరెక్టర్స్.. సక్సెస్ కోసం కొత్త దారిలోకి!

Sekhar Kammula, Vivek Athreya, Tollywood: ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే ఎవ్వరైనా సరే.. తమను తాము ట్రెండ్​కు తగ్గట్లు మార్చుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు మారుతూ పోతేనే నిలబడగలరు. ఇప్పుడు దీన్ని అమల్లో పెడుతున్నారు టాలీవుడ్ మేకర్స్.

Sekhar Kammula, Vivek Athreya, Tollywood: ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే ఎవ్వరైనా సరే.. తమను తాము ట్రెండ్​కు తగ్గట్లు మార్చుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు మారుతూ పోతేనే నిలబడగలరు. ఇప్పుడు దీన్ని అమల్లో పెడుతున్నారు టాలీవుడ్ మేకర్స్.

ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే ఎవ్వరైనా సరే.. తమను తాము ట్రెండ్​కు తగ్గట్లు మార్చుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు మారుతూ పోతేనే నిలబడగలరు. అందునా కరోనా తర్వాత ఆడియెన్స్​ మూవీస్​ను చూసే విధానం మారిపోయింది. ఓటీటీల వల్ల వరల్డ్ సినిమాను చూస్తూ వాళ్ల టేస్ట్ ఛేంజ్ అయింది. అందుకే మూసధోరణి, రోత, రొట్టకొట్టుడు సినిమాలను ఇప్పుడు ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. దీంతో ఫిల్మ్ మేకర్స్ కూడా మారుతున్నారు. తాము స్టిక్ అయిన జోనర్స్​ను పక్కనబెట్టి ప్రయోగాలకు తెరదీస్తున్నారు. కంఫర్ట్ జోన్​లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హిట్ కోసం ట్రాక్ మార్చుకునేందుకు ఏమాత్రం భయపడటం లేదు. సక్సెస్ కోసం కొత్త దారుల్లోకి వెళ్తున్న టాలీవుడ్ డైరెక్టర్స్ చాలా మందే ఉన్నారు. వాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇటీవల ‘సరిపోదా శనివారం’తో ఆడియెన్స్​ను మెప్పించాడు. సూపర్​హిట్​గా నిలిచిన ఈ సినిమాతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇచ్చాడు దర్శకుడు. గతంలో ‘అంటే సుందరానికి’, ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరు రా’ లాంటి క్లాస్ మూవీస్ తీసిన వివేక్.. ఒకేసారి ట్రాక్ మార్చేశాడు. నానితో ‘సరిపోదా శనివారం’ అంటూ కమర్షియల్ మాస్ ఎంటర్​టైనర్ తీసేసరికి అంతా షాకయ్యారు. తన జోనర్ కానప్పటికీ డిఫరెంట్ స్క్రీన్​ప్లేతో నడిపిస్తూ.. కామెడీ టచ్ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్​టైన్ చేశాడు. ‘అంటే సుందరానికి’ వరకు ఒక ఇమేజ్​తో ఉన్న వివేక్.. ఇప్పుడు క్లాస్, మాస్​ రెండూ తీసి సక్సెస్ కొడతాననే నమ్మకాన్ని అందరిలో కల్పించాడు. వివేక్ బాటలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ‘గోదావరి’ నుంచి ‘లవ్​స్టోరీ’ వరకు క్లాస్ ఫిల్మ్స్ తీసిన ఆయన.. ‘కుబేర’తో రూట్ మార్చేసినట్లు తెలుస్తోంది.

‘కుబేర’ గ్లింప్స్, టీజర్​లోని కంటెంట్ చూసి అసలు ఇది శేఖర్ కమ్ముల చిత్రమేనా అని చాలా మంది షాకయ్యారు. తన మార్క్​ను పక్కనబెట్టి ఆడియెన్స్​ను సర్​ప్రైజ్ చేశాడాయన. ఈ కంటెంట్ చూస్తుంటే కమ్ముల కంప్లీట్ ట్రాక్ మార్చేసినట్లు కనిపిస్తోంది. నానితో ఆయన చేస్తాడని అంటున్న ప్రాజెక్ట్ కూడా డిఫరెంట్ జోనర్​లో ఉండబోతోందని టాక్ నడుస్తోంది. ఇకపై వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకు తనలోని డిఫరెంట్ టేస్ట్​ను చూపించేందుకు ఆయన ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం. ‘కార్తికేయ 2’ లాంటి డివోషనల్ మూవీతో బ్లాక్​బస్టర్ కొట్టిన చందు మొండేటి కూడా నాగ చైతన్యతో తీస్తున్న ‘తండేల్’తో ఆడియెన్స్​ను సర్​ప్రైజ్ చేయనున్నాడట. ఏ మేకర్ అయినా ఒకే జోనర్​లో మూవీస్ తీయాలనుకోరు. అయితే వాళ్ల టేస్ట్​, సక్సెస్​ను బట్టి కొన్నాళ్లు స్టిక్ అయిపోతారు. వాళ్లు అందులో నుంచి బయటకు వచ్చి వైవిధ్యమైన కథలతో ముందుకు వస్తే ఆ సినిమాలు ఇచ్చే ఫీలింగే వేరు. ఇప్పుడు ఇలాంటి అనుభూతిని ప్రేక్షకులకు ఇచ్చేందుకు టాలీవుడ్ మేకర్స్ ప్రయత్నిస్తున్నారని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.

Show comments