థియేటర్స్​లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన రక్షిత్ శెట్టి ‘సప్త సాగరాలు దాటి’!

  • Author singhj Published - 02:15 PM, Fri - 29 September 23
  • Author singhj Published - 02:15 PM, Fri - 29 September 23
థియేటర్స్​లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన రక్షిత్ శెట్టి ‘సప్త సాగరాలు దాటి’!

తెలుగు ప్రేక్షకులది గొప్ప మనసనే చెప్పాలి. టాలీవుడ్ మూవీస్​తో పాటు కంటెంట్ బాగుంటే ఇతర భాషా సినిమాలను కూడా మనోళ్లు ఆదరిస్తుంటారు. అందుకే తమిళం, కన్నడతో పాటు ఇంగ్లీష్ మూవీస్​ కూడా ఇక్కడ డబ్ అయి రిలీజ్ అవుతుంటాయి. డబ్బింగ్ చిత్రాలతో రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్ సహా ఎందరో పర భాషా ఇండస్ట్రీలకు చెందిన హీరోలు తెలుగు నాట స్టార్ ఇమేజ్ సంపాదించారు. ఈ కోవలోనే ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు రక్షిత్ శెట్టి. డిఫరెంట్ మూవీస్​తో కన్నడలో ఈ యంగ్ హీరో సంచలన హిట్స్ అందుకున్నారు. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ మూవీస్​తో తెలుగువారికీ ఆయన దగ్గరయ్యారు.

‘777 చార్లీ’ సినిమా కన్నడలో తర్వాత ఎక్కువగా వసూళ్లు సాధించింది తెలుగునాటే. అందుకే తన రీసెంట్ మూవీ ‘సప్త సాగరాలు దాచే ఎల్లో’ను తెలుగులోకి తీసుకొచ్చారు రక్షిత్ శెట్టి. ఈ మూవీని ‘సప్త సాగరాలు దాటి: సైడ్-ఎ’ పేరుతో ఇక్కడ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 22న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో రాలేదు. కన్నడలో బ్లాక్​బస్టర్​గా నిలిచిన ఈ మూవీ తెలుగు నాట థియేటర్లలో రిలీజై వారం కూడా కాకుండానే డిజిటల్​ స్ట్రీమింగ్​కు రెడీ అయిపోయింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్​గా ఓటీటీలోకి రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్​ థ్రిల్​ అవుతున్నారు.

‘సప్త సాగరాలు దాటి’ మూవీ అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమింగ్​ అవుతోంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. హేమంత్‌ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రక్షిత్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్​గా యాక్ట్ చేశారు. పవిత్ర లోకేష్​తో పాటు అవినాష్, అచ్యుత్ కుమార్​లు కీలక పాత్రల్లో కనిపించారు. మనసుకు హత్తుకునే లవ్ స్టోరోగా దీన్ని హేమంత్ తెరకెక్కించారు. మను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వసంత్) మధ్య ప్రేమ, ఫ్యూచర్ గురించి వీళ్లు కనే కలలు నేపథ్యంగా ఈ సినిమా స్టోరీ సాగుతుంది. కలలు కన్నంత అందంగా ఈ జంట తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుందా అనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

ఇదీ చదవండి: హీరో సిద్ధార్థ్​కు సారీ చెప్పిన ప్రకాశ్​ రాజ్.. ఎందుకంటే?

Show comments