Kalki 2898 AD Movie Ticket Rates Decreased: అభిమానులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న కల్కి టికెట్‌ ధరలు.. అప్పటి నుంచేనా!

Kalki 2898 AD: అభిమానులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న కల్కి టికెట్‌ ధరలు.. అప్పటి నుంచేనా!

ప్రభాస్‌ నటించిన కల్కి సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో కల్కికి సంబంధించి ఓ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలు..

ప్రభాస్‌ నటించిన కల్కి సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో కల్కికి సంబంధించి ఓ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలు..

కల్కి.. మీడియా, సోషల్‌ మీడియా ఎక్కడ చూసినా ఈ పేరే కనిపిస్తోంది.. వినిపిస్తోంది. సినిమా విడుదల ముందు వరకు ఉన్న క్రేజ్‌.. రిలీజ్‌ తర్వాత మరింతగా పెరిగింది. పిల్లలతో సహా ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన చిత్రం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ మీద.. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో.. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకోనే ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ప్రభాస్‌ కెరీర్‌లో బాహుబలి తర్వాత ఆ రేంజ్‌లో వసూళ్లు సాధించిన సినిమాగా కల్కి నిలిచిపోయింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే 500 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. ఈ వీకెండ్‌ నాటికి 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.

ఇకపోతే కల్కి సినిమా తక్కువ రోజుల్లోనే ఇంత భారీ కలెక్షన్లు కొల్లగొట్టడానికి ప్రధాన కారణం.. పెంచిన టికెట్‌ రేట్లు అని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కల్కి టికెట్‌ రేట్లు పెంచుకోవడానికి, అదనపు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చాయి. దాంతో కల్కి టికెట్‌ ధర భారీగా పెరిగింది. మల్టిప్లేక్స్‌లో ఒక్క వ్యక్తి కల్కి చూడాలంటే టికెట్‌ కోసమే తక్కువలో తక్కువ 500 రూపాయలు చెల్లించాలి. సింగిల్‌ స్క్రీన్‌లో కూడా టికెట్‌ ధర భారీగానే ఉంది.

దీనిపై సామాన్యులు విమర్శలు చేస్తున్నారు. టికెట్‌ రేట్లు ఇంత భారీగా ఉంటే.. కుటుంబం మొత్తం సినిమా చూడాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఈ నిర్ణయంపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కల్కి టికెట్ ధరలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కల్కి సినిమా టికెట్ ధర తగ్గనుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న ధరలు తగ్గించి.. ముందుగా అనగా నార్మల్‌ రేటుకు టికెట్‌ను అమ్మబోతున్నట్లు తెలుస్తోంది. అంటే మల్టీప్లేక్స్‌లో టికెట్‌ ధర 235 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 150 రూపాయలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఈవారం గడిచిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారట.

కల్కి సినిమా కలెక్షన్స్‌ మరింత పెరగాలంటే.. అది ఫ్యామిలీ ఆడియన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం థియేటర్లకు వచ్చి సినిమా చూడాలంటే భయపడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని త్వరగానే గ్రహించిన మూవీ మేకర్స్ అతి త్వరలో సినిమా టికెట్ ధరలను తగ్గించే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. టికెట్‌ ధరలు తగ్గిస్తే.. చాలా మంది మరోసారి సినిమా చూసే అవకాశం కూడా ఉంది అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Show comments