RRR ఓటిటి డేట్ ఫిక్స్ ?

ఔననే అంటున్నాయి డిజిటల్ వర్గాలు. మార్చి 25న విడుదలై 1100 కోట్లకు పైగా వసూలు చేసి యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ విజువల్ గ్రాండియర్ ఈ నెల 20న తెలుగు వెర్షన్ జీ5లో, హిందీ డబ్బింగ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోందని లేటెస్ట్ అప్ డేట్. ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కానీ ఆల్మోస్ట్ లాక్ అయినట్టుగా చెబుతున్నారు. అప్పటికి యాభై రోజులు దాటేసి ఉంటుంది కాబట్టి అంతకన్నా రన్ ఆశించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే. పైగా 12న మహేష్ బాబు సర్కారు వారి పాట వచ్చాక వరసబెట్టి పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ ను వీలైనంత త్వరగా ఇస్తే ఓటిటిలోనూ రికార్డులు వస్తాయి.

ఇప్పటికే ట్రిపులార్ లోని ముఖ్యమైన పాటలను వీడియో సాంగ్స్ రూపంలో రిలీజ్ చేసేశారు. కీరవాణి కంపోజ్ చేసిన ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని యుట్యూబ్ లో పెట్టేశారు. సో ఇవన్నీ ఓటిటి ప్రీమియర్ కు ముందస్తు సంకేతాలే. నెల రోజుల తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ వీకెండ్స్ లో మంచి వసూళ్లు రాబట్టుకుంది. మొన్న ఆదివారం, నిన్న రంజాన్ పండగ సందర్భంగా చాలా చోట్ల ఆచార్య కంటే ట్రిపులార్, కెజిఎఫ్ 2 వసూళ్లే ఎక్కువగా ఉండటం గమనార్హం. సో మే 20న స్ట్రీమ్ చేయడమనేది మంచి నిర్ణయమే. క్వాలిటీ విషయంలో ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ తో పోలిస్తే వెనుకబడి ఉన్న జీ5 ఇప్పుడీ సినిమాతో అయినా మార్పు చేస్తుందేమో చూడాలి.

నిజానికి దీన్ని రెండున్నర నెలల తర్వాత స్మార్ట్ స్క్రీన్ కు ఇస్తామని గతంలో నిర్మాతలు చెప్పారు కానీ ఇప్పుడా అవసరం కనిపించడం లేదు. జనానికి దాని మీద ఆసక్తి తగ్గకముందే ఇచ్చేస్తే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. విజయ్ బీస్ట్ 11నే సన్ నెక్స్ట్ లో రాబోతోంది. కెజిఎఫ్ 2ని మే 27న ప్రైమ్ లో విడుదల చేస్తారనే ప్రచారం జోరుగా ఉంది. సో మొత్తానికి ఈ నెలలో ఓటిటి జనాలకు మంచి ఎంటర్ టైన్మెంట్ దొరకబోతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ వెర్షన్ బయటికి వచ్చాక మళ్ళీ తారక్ చరణ్ ఫ్యాన్స్ తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్పని వీడియోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో హంగామా చేయడం ఖాయం.

Show comments