Venkateswarlu
Venkateswarlu
చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇచ్చారు రేణు దేశాయ్. రవి తేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా టీం ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. ఈ ప్రమోషన్లలో రేణు దేశాయ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన అనారోగ్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. రేణు దేశాయ్ మాట్లాడుతూ… తాను మయోకార్డియల్ బ్రిడ్జింగ్ వ్యాధితో బాధపడుతున్నానని అన్నారు.
ఈ వ్యాధి తనకు తన నాన్నమ్మ నుంచి వారసత్వంగా వచ్చిందని ఆమె తెలిపారు. అది జెనటిక్ ప్రాబ్లమ్ అని, తన తండ్రికి కూడా ఉందని వెల్లడించారు. మయోకార్డియల్ బ్రిడ్జింగ్ గుండెకి సంబంధించిన వ్యాధని, దానికి బైపాస్ సర్జరీ లాంటివి ఏమీ లేవని పేర్కొన్నారు. పుట్టుకతో వచ్చిందని, మందులు వేసుకుంటూ ఉండటం వల్ల లావు అవుతున్నానని అన్నారు. ఆ వ్యాధితో తాను చాలా బాధపడుతున్నానని తెలిపారు. కొంచెం నడిచినా కూడా అలసిపోతూ ఉంటానని, గుండె నొప్పి వస్తుందని చెప్పారు.
హార్ట్ బీట్స్‌ను చెక్ చేయటానికి యాపిల్ వాచ్ వాడుతున్నానని అన్నారు. హార్ట్ రేట్ పెరిగినపుడు వాచీ తెలియజేస్తుందని, బీటా బ్లాకర్స్ వాడతానని చెప్పారు. దీన్ని జీవితాంతం భరించాల్సిందేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చాలా మంది డాక్టర్లను కలిసినా ప్రయోజనం లేకుండాపోయిందని తెలిపారు. బీటా బ్లాకర్స్‌ను వాడటమే పరిష్కారమని వారు తెలిపారని అన్నారు. మరి, రేణు దేశాయ్ మయోకార్డియల్ బ్రిడ్జింగ్ వ్యాధితో బాధపడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.