Mr Bachchan Movie 3rd Day Collections: మిస్టర్ బచ్చన్ కు 3వ రోజు దారుణమైన కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే!

మిస్టర్ బచ్చన్ కు 3వ రోజు దారుణమైన కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే!

Mr Bachchan Movie 3rd Day Collections; రవి తేజ నటించిన మిస్టర్ బచ్చన్.. సినిమా ఆగష్టు 15 న థియేటర్ లో రిలీజ్ అయింది. కాగా ఈ సినిమా రిలీజ్ కు ముందు ఉన్నంత ఊపు రిలీజ్ తర్వాత మాత్రం లేకుండా పోయింది. మూడు రోజు కలెక్షన్స్ ఇంకాస్త పడిపోయాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Mr Bachchan Movie 3rd Day Collections; రవి తేజ నటించిన మిస్టర్ బచ్చన్.. సినిమా ఆగష్టు 15 న థియేటర్ లో రిలీజ్ అయింది. కాగా ఈ సినిమా రిలీజ్ కు ముందు ఉన్నంత ఊపు రిలీజ్ తర్వాత మాత్రం లేకుండా పోయింది. మూడు రోజు కలెక్షన్స్ ఇంకాస్త పడిపోయాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హరీష్ శంకర్, రవి తేజ కాంబినేషన్ లో రిలీజ్ అయినా మిస్టర్ బచ్చన్ సినిమా.. ఆగష్టు 15న థియేటర్ లో రిలీజ్ అయింది. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై మీడియా, సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ నెలకొంది. పైగా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో కొనసాగడంతో.. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరొక్కసారి అందరూ వింటేజ్ రవితేజను చూడొచ్చని అనుకున్నారు. కానీ మూవీ రిలీజ్ తర్వాత మాత్రం అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో మూడో రోజు కలెక్షన్స్ మరింత దారుణంగా పడిపోయాయి. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

మిస్టర్ బచ్చన్ మూవీకి నైజం , సీడెడ్ , ఆంధ్ర ఇలా అన్ని ఏరియాలలో కలుపుకుని రూ. 11.50 కోట్లు బిజినెస్ జరిగింది. దీనితో పాటు కర్ణాటక, ఓవర్సీస్.. మొత్తంగా వరల్డ్ వైడ్ గా రూ. 31.00 కోట్లు బిజినెస్ జరుపుకుంది. ఇక రిలీజ్ తర్వాత ఈ మూవీ మొదటి రోజు నుంచే కలెక్షన్స్ విషయంలో నిరాశ చూపించింది. రెండవ రోజు వరల్డ్ వైడ్ గా రూ. 1.75 కోట్లు రాబట్టగా.. మూడవ రోజు కలెక్షన్స్ మరింత దారుణంగా పడిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 75 లక్షలు షేర్ రాగా.. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలుపుకుని రూ. 85 లక్షలే మాత్రమే సొంతం చేసుకుంది. మరి ఇలా అయితే బ్రేక్ ఈవెన్ కష్టంగానే కనిపిస్తుంది. ఈ మూవీ లాంగ్ రన్ లో ప్రేక్షకులను ఏ మేరకు కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి.

మిస్టర్ బచ్చన్ సినిమాకు ఇలాంటి నిరాశ ఎదురవుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే థియేట్రికల్ రిలీజ్ కు ముందు విడుదల చేసిన సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను బాగానే ఇంప్రెస్స్ చేశాయి. కానీ ఎందుకో సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కాగా ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ఇక ఈ మూవీలో రవితేజకు జోడిగా నటించిన భాగ్యశ్రీ బోర్సే కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. కుర్రాళ్ళ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది ఈ అమ్మడు. మరి ఈ మూవీ రానున్న రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. మరి మిస్టర్ బచ్చన్ 3వ రోజు కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments