P Krishna
Rashmika Mandana:నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మీక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. ఈ అమ్మడు తన లైఫ్ లో బెస్ట్ జర్నీ గురించి చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Rashmika Mandana:నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మీక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. ఈ అమ్మడు తన లైఫ్ లో బెస్ట్ జర్నీ గురించి చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
P Krishna
ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతోమంది కన్నడ బ్యూటీలు ఎంట్రీ ఇచ్చారు. అతి కొద్దిమంది మాత్రమే స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కిర్రిక్ పార్టీ తో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల తార రష్మిక. ఈ సినిమా మంచి హిట్ కావడంతో నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’ మూవీ రష్మికు మంచి పేరు తీసుకు వచ్చింది. వరుసగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఛాన్సులు రావడమే కాదు.. నేషనల్ క్రష్ గా కుర్రాళ్ళ హృదయాలు గెల్చుకుంది. తాజాగా ఈ అమ్మడు తన బెస్ట్ జర్నీ గురించి కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఛలో’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. క్యూట్ లుక్ తో కుర్రాళ్ల హృదయాలు కొల్లగొడుతున్న ఈ అమ్మడు తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించిన పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రష్మక మందన్న దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై ఇటీవల ప్రయాణించారు. ఈ వంతెనపై తన ప్రయాణం గురించిన అనుభూతి అభిమానులతో షేర్ చేసుకుంది. నా లైఫ్ లో ఇదో అద్భుతమైన జర్నీ.. 2 గంటల ప్రయాణం కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయవొచ్చు. ఒక జర్ని ఇంత త్వరగా ముగుస్తుందా అని ఎవరూ ఊహించి ఉండరు. మనం ఇప్పుడు ముంబయి నుంచి నవీ ముంబయికి సులువుగా తక్కువ సమయంలో ప్రయాణించవొచ్చు అని తెలిపింది.
ఓ వార్తా సంస్థతో రష్మిక మాట్లాడుతూ.. ‘భారత్ ఇంత వేగంగా అభివృద్ది చెందుతుంది అనడానికి ఇదే ఉదాహారణ.. మనల్ని ఇప్పుడు ఎవరూ ఆపలేరు. యువ బారత్ ఏదైనా సాధిస్తుంది.. గత పదేళ్లలో దేశం ఎంతగానో అభివృద్ది చెందింది. ప్రపంచ దేశాలతో అన్ని రంగాల్లో పోటీ పడుతుంది. దేశంలో మౌలిక వసతులు, రహదారి ప్రణాళిక ఎంతో అద్భుతంగా ఏర్పాటు అవుతున్నాయి’ అంటూ మాట్లాడింది. ముంబైలో నిర్మించిన సముద్రపు వంతన ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ జనవరిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశంలోనే పొడవైన వంతెన ఇది.. ముంబయిలోని సెవ్రీ నుంచి రాయ్ ఘడ్ లోని సహవా శేవాను కలుపుతూ రూ.21,200 కోట్ల వ్యయంతో 6 లైన్లుగా నిర్మించినా ‘అటల్ సేతు’ మొత్తం పొడవు 21.8 కిలో మీటర్లు.. అందులో 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప 2’, ‘కుభేర’.. బాలీవుడ్ లో సికిందర్, రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్, చావా మూవీస్ తో బిజీగా ఉన్నారు.