Nidhan
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న ‘రామాయణ’ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ కూడా ఇందులో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న ‘రామాయణ’ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ కూడా ఇందులో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
Nidhan
‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు శాండల్‌వుడ్ స్టార్ యష్. ఈ రెండు మూవీస్ కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళంలో హిట్ అయ్యాయి. హిందీలో కూడా భారీగా వసూళ్లు వచ్చాయి. దీంతో ఆయనతో సినిమాలు తీసేందుకు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ క్యూ కట్టారు. అయితే అందరికీ నో చెబుతూ వచ్చిన రాకింగ్ స్టార్.. ఎట్టకేలకు ఓ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. అదే ‘రామాయణ’. రణబీర్ కపూర్ హీరోగా నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రావణుడిగా కనిపించనున్నారు యష్. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న ‘రామాయణ’తో ఆడియెన్స్‌కు మునుపెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తామని మేకర్స్ అంటున్నారు. అయితే ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న యష్ భారీ సాహసం చేస్తున్నారు.
‘రామాయణ’ మూవీలో యాక్ట్ చేయడమే గాక నిర్మాణంలోనూ భాగం కానున్నారు యష్. ఆయనకు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ‘రామాయణ’ను నిర్మిస్తున్న నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్‌తో కలసి పని చేయనుంది. రెమ్యూనరేషన్ తీసుకోకపోవడమే గాక సినిమాలో పెట్టుబడి కూడా పెట్టేందుకు సిద్ధమైపోయారు రాకింగ్ స్టార్. తద్వారా చిత్రానికి జరిగే బిజినెస్, వచ్చే లాభాల్లో వాటా తీసుకోవాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. అయితే రెబల్‌స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి సౌత్ స్టార్స్ కూడా హిందీ వాళ్లతో కలసి పని చేస్తున్నారు. కానీ వాళ్లు నిర్మాణంలో జోక్యం చేసుకోలేదు. అయితే యష్ మాత్రం డేర్ చేసి డబ్బులు పెట్టేందుకు రెడీ అయ్యారు. అది కూడా బడ్జెట్ ఎంత అవుతుందో అంతుపట్టని విధంగా ఉన్న ప్రాజెక్ట్‌పై.
‘రామాయణ’ నిర్మాణంలో పాలుపంచుకోకుండా కేవలం యాక్ట్ చేస్తే యష్‌కు ఈజీగా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లు దక్కేవని టాక్. ఏ రిస్క్ లేకుండా నటించి తన రెమ్యూనరేషన్ తీసుకొని వెళ్లిపోవచ్చు. పైగా తీస్తోంది కన్నడ వాళ్లు కూడా కాదు.. బాలీవుడ్ మేకర్స్. అలాంటప్పుడు యష్ ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘రామాయణ’ నిర్మాణంలో వార్నర్ బ్రదర్స్ లాంటి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌజ్ కూడా భాగమవుతోంది. దీన్ని బట్టే ఆ మూవీ స్కేల్, విజువల్ ఎఫెక్ట్స్‌కు అయ్యే ఖర్చు ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగి లాభాలు వస్తే ఓకే.. గానీ ఏమాత్రం తేడా వచ్చినా భారీ నష్టాలు తప్పవు. ఇన్ని తెలిసినా యష్ ప్రొడక్షన్లోకి ఎంటర్ అవుతున్నారంటే ‘రామాయణ’ సబ్జెక్ట్ మీద ఆయనకు ఉన్న నమ్మకమేనని తెలుస్తోంది. మరి.. యష్ నటనతో పాటు నిర్మాతగానూ ‘రామాయణ’తో అనుకున్నది సాధిస్తారేమో చూడాలి. ఈ మూవీ కోసం మీరెంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BIGGG DEVELOPMENT… YASH JOINS HANDS WITH NAMIT MALHOTRA TO PRODUCE ‘RAMAYANA’… This is a groundbreaking collaboration… #NamitMalhotra [Prime Focus] and actor #Yash [Monster Mind Creations] have joined forces to produce the epic saga #Ramayana for #Indian and global audiences.… pic.twitter.com/jbMcIBzVZ5
— taran adarsh (@taran_adarsh) April 12, 2024