Krishna Kowshik
కోలీవుడ్ నటుడు రాఘవ లారెన్స్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. డ్యాన్సర్ నుండి నటుడిగా, ఆ తర్వాత దర్శకుడిగా మారిన సంగతి విదితమే. అయితే వెండితెరపైన హీరో మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరోనే.
కోలీవుడ్ నటుడు రాఘవ లారెన్స్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. డ్యాన్సర్ నుండి నటుడిగా, ఆ తర్వాత దర్శకుడిగా మారిన సంగతి విదితమే. అయితే వెండితెరపైన హీరో మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా హీరోనే.
Krishna Kowshik
దర్శకుడు కమ్ నటుడు రాఘవ లారెన్స్ గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండదు బహుశా. హార్రర్, యాక్షన్ చిత్రాలతో అలరిస్తున్నాడు ఈ స్పీడ్ డ్యాన్సర్. గత ఏడాది రుద్రన్, చంద్రముఖి 2, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాలతో మెప్పించాడు. అతడు సినిమాల్లోనే కాదు.. బయటకు కూడా రియల్ హీరో. తన చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఎంతో మంది వికలాంగులు, అనాథలకు, అభాగ్యులకు చేతనైనా సాయం చేస్తున్నాడు. కొన్నిసార్లు వారితో సినిమాల్లో యాక్ట్ కూడా చేయిస్తుంటాడు. లారెన్స్ ఇటీవల వికలాంగులకు బైక్స్ పంచిన సంగతి విదితమే. ఇప్పుడు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మరో సారి అభిమానులు హృదయాన్ని గెలిచాడు. తాను ప్రకటించినట్లుగానే భారీ సాయాన్ని అందించాడు.
ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న పేద రైతుకు ట్రాక్టర్‌ను అందించాడు రాఘవ లారెన్స్. ఓ కుటంబానికి ఈ ట్రాక్టర్ బహుమతిగా ఇస్తూ సర్ ప్రైజ్ చేశాడు. మాత్రమ్ సర్వీస్ కింద వీటిని పేద రైతులకు అందించబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నాడు. ‘హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్. మాత్రమ్ సేవ ఈ రోజు ప్రారంభమైందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. గతంలో నేను ప్రకటించినట్లుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు 10 ట్రాక్టర్లను అందజేస్తాం. తొలి ట్రాక్టర్ విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందించాం. అతను తన సోదరి భర్త చనిపోవడంతో ఆమెతో పాటు తన కుటుంబాన్ని కూడా చూసుకుంటున్నాడు. ఈ రోజు కొత్త ట్రాక్టర్‌ను నడుపుతున్నప్పుడు అతడి కళ్లల్లో ఆనందం చూడాలని భావించాను.
అందుకే సర్ ప్రైజ్ చేయాలని అనుకున్నాం. నా టీం సభ్యులు అతడికి ట్రాక్టర్ కీని అందజేశాం. కష్టాల్లో ఉన్న రైతుకు ఆనందాన్ని, మద్దుతును అందజేద్దాం’ అంటూ ట్వీట్ చేశాడు లారెన్స్. అతడు ఇచ్చిన సర్ ప్రైజ్ గిప్టుతో ఉబ్బితబ్బిబ్బు అయిపోయింది కుటుంబం. లారెన్స్ కాళ్ల మీద పడిపోయి ఆనందాన్ని వ్యక్తం చేసింది. అనంతరం ట్రాక్టర్ తీసుకుని ఇంటికి పయనమైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చాలా మంది లారెన్స్ చేస్తున్న పనిని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. మానవ రూపంలో ఉన్న దేవుడుయ్యా నీవు అంటూ కొనియాడుతున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వాలు కూడా పట్టించుకోని ఈ రోజుల్లో.. చాలా పెద్ద సాయం చేశాడు ఈ రియల్ హీరో. ఇక లారెన్స్ సినిమాల విషయానికి వస్తే.. దుర్గా సెంథిల్ కుమార్ దర్శకత్వంలో అధిగ్రాం అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ ఏడాది రిలీజ్ కానుంది. అలాగే దుర్గ అనే మూవీని కూడా చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Hi friends and fans! I am excited to announce that Maatram’s service begun today. As I mentioned in our press meet, we will be presenting 10 tractors to financially struggling farmers. Our first tractor was presented to RajaKannan family from Vilupuram District, who is now solely… pic.twitter.com/7XePCpNweb
— Raghava Lawrence (@offl_Lawrence) May 1, 2024