పుష్ప 2 మేకర్స్ గ్రాండ్ ప్లానింగ్.. బాహుబలి2 రికార్డ్స్ బ్రేక్!

Pushpa 2 Update: నిన్న మొన్నటి వరకు దేవర మ్యానియాతో మునిగితేలిన ప్రేక్షకులు.. ఇప్పుడు పుష్ప రాజ్ క్రియేట్ చేయబోయే మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్నారు . ఇప్పటివరకు పుష్ప 2 ముందు దేవర టార్గెట్ మాత్రమే ఉంది . కానీ ఇప్పుడు పెరుగుతున్న క్రేజ్ ను చూస్తే దేవర కాదు బాహుబలి 2 టార్గెట్ కనిపిస్తుంది.

Pushpa 2 Update: నిన్న మొన్నటి వరకు దేవర మ్యానియాతో మునిగితేలిన ప్రేక్షకులు.. ఇప్పుడు పుష్ప రాజ్ క్రియేట్ చేయబోయే మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్నారు . ఇప్పటివరకు పుష్ప 2 ముందు దేవర టార్గెట్ మాత్రమే ఉంది . కానీ ఇప్పుడు పెరుగుతున్న క్రేజ్ ను చూస్తే దేవర కాదు బాహుబలి 2 టార్గెట్ కనిపిస్తుంది.

థియేట్రికల్ రిలీజ్ , వసూళ్లు ఈ రెండు విషయాల్లో కూడా బాహుబలి 2 మూవీ సునామి సృష్టించింది. అప్పటివరకు ఏ సినిమాలు రిలీజ్ కానన్ని థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయింది.  ఏకంగా పది వేలకు పైగా థియేటర్స్ లో బాహుబలి 2 సినిమాను రిలీజ్ చేశారు. అదే రేంజ్ లో రికార్డ్స్ ను సృష్టించింది. ఇక ఆ తర్వాత ఏ ఇండియన్ మూవీ కూడా అన్ని థియేటర్స్ లో రిలీజ్ కాలేదు. ఆఖరికి ఆర్ఆర్ఆర్ కూడా ఆ రికార్డ్ ను బ్రేక్ చేయలేకపోయింది. ఎప్పుడో ముగిసిన బాహుబలి హిస్టరీ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవ్వడానికి కారణం.. రిలీజ్ కు రెడీ గా ఉన్న పుష్ప2. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఎలాంటి హైప్ నడుస్తుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. నిన్న మొన్నటివరకు పుష్ప2 ముందు ఉన్నది దేవర క్రియేట్ చేసిన టార్గెట్ మాత్రమే. కానీ ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం పుష్ప 2.. బాహుబలి 2 రికార్డ్స్ ను బ్రేక్ చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇంకా కనీసం సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు. బుకింగ్స్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే బాహుబలి 2 రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని ఎలా చెప్పగలం.. అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే బాహుబలి లాంటి ఈవెంట్స్ జరగకపోయినా.. ఈ సినిమాకు కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఈ సినిమా సిక్వెల్ కోసం ప్రపంచమంతా ఎదురుచూసింది. ఇప్పుడు అదే క్రేజ్ ను దక్కించుకోవడానికి.. పుష్ప 2 టీం భారీగా ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా 11,500 స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నారట. అందులో ఇండియాలో 6500 స్క్రీన్స్ , విదేశాల్లో 5 వేల స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి పుష్ప పార్ట్ 1 రిలీజ్ కు ముందు పాన్ ఇండియా లెవెల్ లో పెద్దగా అంచనాలు ఏమి లేవు. కేవలం తెలుగులో మాత్రమే హైప్ కొనసాగింది. కానీ ఒక్కసారి బొమ్మ థియేటర్ లో పడిన తర్వాత.. సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

అసలు తెలుగు సినిమాను పెద్దగా పట్టించుకోని.. పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకు మంచి బజ్ దక్కింది. అప్పటినుంచి కూడా ఈ మూవీ సిక్వెల్ కోసం భారీగా అంచనాలు మొదలయ్యాయి. అందుకోసమే పుష్ప2 సినిమాను కని విని ఎరుగని రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. పైగా చెప్పిన టైం కు ఓ రోజు ముందే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సో ఇలా ఏ రకంగా చూసినా కానీ పుష్ప 2 బాహుబలి 2 ను కొట్టడానికి అనుకూలంగానే ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. ఆశించిన స్థాయిలో అంచనాలను నిలబెడుతుందా లేదా .. ఇవన్నీ తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ సినిమా అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments