iDreamPost
iDreamPost
దేశం గర్వపడే వీరుడు పృథ్వీరాజ్ పాత్రను పోషిస్తున్నారు అక్షయ్ కుమార్. ఈ సినిమాలో సంజయ్ దత్, సోనూ సూద్, అషుతోష్ రాణా, సాక్షి తన్వర్ లాంటి సీనియర్ యాక్టర్లు ఉన్నారు. మనూషీ చిల్లార్ తొలిసారి వెండితెర అరెంగ్రేటమిది. బహుబలి రేంజ్ లో రికార్డులను టార్గెట్ చేసిన ఈ సినిమాకు డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేదీ
భయంతెలియని యోధుడు పృథ్విరాజ్ చౌహన్ నిజజీవితం ఆధారంగా యాష్ రాజ్ ఫిల్మ్ తీర్చిదిద్దిన మూవీ పృథ్విరాజ్. మహ్మమథ్ ఘోరీ భయంకర దాడుల నుంచి ఉత్తర భారతావనని కాపాడిన వీరునిగా గొప్ప చరిత్ర పృథ్విరాజ్ ది. సినిమా నిజంగా విజువల్ వండర్ కానుంది. ఈ సినిమాను దేశంలోనే ముఖ్యమైన నేతకు ప్రదర్శించనున్నారు. అక్షయ్ కుమార్ ప్రధాని మోదీకి వీరాభిమాని. ఆయన్ను ఇంటర్వ్యూ చేశారుకూడా. ఆయన సినిమాకు బీజేపీ అభిమానుల్లో చాలా క్రేజ్ ఉంది. ఈసారి మాత్రం ఆయన తన సినిమాను మోదీకి ప్రదర్శించడంలేదు. మరి వారెవరు?
జూన్1న హోంమంత్రి అమిత్ షా, వెండితెరపై పృథ్విరాజ్ వీరత్వాన్ని చూడనున్నారు. దేశం ఎన్నదగిన గొప్ప వీరుడు పృథ్విరాజ్ చౌహన్. ఒక్కడే మహమ్మద్ ఘోరీని అడ్డుకున్నాడు. ఎవరూసాయం రాకపోయినా, భార్య సంయుక్త తండ్రి ద్రోహం చేసినా, చివరి ఒవరి పోరాడాడు. వీరుడనిపించుకున్నాడు. ఇప్పుడు ఆ సాహసమే వెండితెరకెక్కింది.