Prashanth Neel: ఉగ్రం రీమేక్‌గా సలార్‌.. ప్రశాంత్‌ నీల్‌ ఏమన్నాడంటే..

ప్రశాంత్‌ నీల్ ఉగ్రం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రశాంత్‌ నీల్‌ బావ మరది శ్రీమురళి ఇందులో హీరోగా నటించారు. 2014లో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రశాంత్‌ నీల్ ఉగ్రం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రశాంత్‌ నీల్‌ బావ మరది శ్రీమురళి ఇందులో హీరోగా నటించారు. 2014లో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రశాంత్‌ నీల్‌ – ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్‌’ శుక్రవారం ప్రేక్షకుల మందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. కొన్ని చోట్ల గురువారం అర్థరాత్రి నుంచే షోలు ప్రారంభం కానున్నాయి. ఇక, రెండు క్రితంనుంచే సలార్‌కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ బుకింగ్స్‌ మొదలయ్యాయి. ఈ విషయంలో సలార్‌ రికార్డులు క్రియేట్‌ చేసింది. లక్షల సంఖ్యలో టికెట్లు అమ్మడయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా కూడా సలార్‌ ప్రీ బుకింగ్స్‌ విషయంలో పాత రికార్డులు తుడిచి పెట్టింది. ఓవర్‌సీస్‌లో దాదాపు 2 మిలియన్ల ప్రీ బుకింగ్స్‌ నమోదు చేసింది. ప్రభాస్‌ సినిమా కావటం.. దీనికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తుండటంతో సలార్‌పై మొదటినుంచి అంచనాలు ఉన్నాయి. మొదటి ట్రైలర్‌ అంచనాలు పెంచేసింది. రెండో ట్రైలర్‌తో ఆ అంచనాలు ఆకాశాన్ని అంటాయి. భారీ అంచనాల కారణంగా సలార్‌ టీమ్‌ ప్రమోషన్లను కూడా పెద్దగా పట్టించుకోలేదు.

 

ఇక, సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సలార్‌ మొదలైన నాటినుంచి వస్తున్న పుకారుపై దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఓ క్లారిటీ ఇచ్చారు. సలార్‌ ప్రశాంత్‌ నీల్‌ మొదటి సినిమా ఉగ్రం రీమేక్‌గా తెరకెక్కుతోందని మొదటి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ నీల్‌ దీని గురించి మాట్లాడుతూ.. ‘‘ ఉగ్రం కథ ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరాలని నేను అనుకున్నాను. 2014లో సినిమా థియేటర్లలో రిలీజైంది.

కానీ, నా కల నెరవేరలేదు. ఆ కథకు న్యాయం చేయకుండా ముందుకు వెళ్లాలని నాకు అనిపించలేదు. నా బుర్రలో వేరే కథలు ఉన్నా ఉగ్రం కథకు న్యాయం చేయాలని అనిపించింది. ఉగ్రం కథకు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. కేజీఎఫ్‌ సినిమా అంత ఎత్తుకు ఉగ్రం వెళ్లాలని భావించాను. నేను సలార్‌ను ఉగ్రం రీమేక్‌గా చూడ్డం లేదు. ప్రభాస్‌కు తగ్గట్టుగా చాలా మార్పులు చేశాను. ఉగ్రం స్టోరీని కేజీఎఫ్‌తో మిక్స్‌ చేసి సలార్‌గా తీయడాన్ని చాలా మంది విమర్శించవచ్చు. నేను దాన్ని ప్రశంసగానే భావిస్తాను. ఎందుకంటే రెండూ నా సృష్టే కదా. ఆ ప్రపంచాలను.. ఆ ప్రపంచంలోని పాత్రలను నేనే క్రియేట్‌ చేశాను’’ అని తెలిపాడు.

​కాగా, ప్రశాంత్‌ నీల్‌ తన బావ మరిది ‘ శ్రీ మురళి’ హీరోగా ఉగ్రం అనే సినిమాను తీశారు. ఆ మూవీకి ప్రశాంత్‌ నీలే నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం 2014 ఫిబ్రవరి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ, ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. మరి, సలార్‌.. ఉగ్రం రీమేక్‌ అన్న విషయంపై ప్రశాంత్‌ నీల్‌ క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments