Swetha
కల్కి ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది. ట్రైలర్ లో కనిపించిన ప్రతి చిన్న విసువల్ ని కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా అది ఏమై ఉంటుందా అనే ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ ట్రైలర్ కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
కల్కి ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది. ట్రైలర్ లో కనిపించిన ప్రతి చిన్న విసువల్ ని కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా అది ఏమై ఉంటుందా అనే ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ ట్రైలర్ కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
Swetha
తాజాగా రిలీజ్ చేసిన కల్కి సినిమా ట్రైలర్ ఇప్పుడు అంతా హాట్ టాపిక్ గా మారింది, ట్రైలర్ ను గమనించినట్లయితే.. విజువల్స్, సినిమా కాన్సెప్ట్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి చిన్న విషయం ప్రభాస్ అభిమానులకు కిక్ ఇచ్చింది. దానితో పాటు ఇంకా చాలా ప్రశ్నలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ మూవీ కథ ఎలా కొనసాగబోతుంది! అమితాబ్ ప్రభాస్ మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి ! కమల్ లుక్ వెనుక దాగి ఉన్న పాత్ర ఏంటి ! దీపికా , దిశా క్యారక్టర్ ఏంటి ! ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకులను ఈ సినిమా చూసేందుకు ప్రేరేపిస్తున్నాయి. ఇక ట్రైలర్ లో కనిపించిన ప్రతి చిన్న విసువల్ ని కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా అది ఏమై ఉంటుందా అనే ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ ట్రైలర్ కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
కల్కి 2898 ఏడీ సినిమాలో కొన్ని షాట్స్ ను నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయాన్ని చిత్రీకరించారని .. సోషల్ మీడియాలో బజ్ వినిపిస్తుంది. అయితే 2020లో పెరుమాళ్లపాడు స్థానిక యువత ఇసుకలో కూరుకుపోయిన.. ఈ ఆలయాన్ని వెలికితీశారు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కూడా కోరారు. ఈ ఆలయం కింద సుమారు 100 ఎకరాల మాన్యం ఉన్నట్లు సమాచారం. 200 ఏళ్ల క్రితం ఇసుక తుపాన్ల కారణంగా ఈ ఆలయం మట్టిలో కూరుకుపోయింది. ఇక ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ను ఈ విజువల్స్ కనిపించడంతో.. ప్రేక్షకులకు ఇప్పుడు కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. మరి దీని వెనుక గల ఏమై ఉంటుందో ఏమో అవన్నీ తెలియాలంటే జూన్ 27 వరకు వేచి చూడాల్సిందే.
కల్కి 2898 AD లో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుంది. కమల్‌హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు అమితాబ్ బచ్చన్, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు చేశారు. ‘బుజ్జి’ అనే వాహనం ఈ మూవీ లో చాలా స్పెషల్. ఇక తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్‌తో సహా మరికొన్ని విదేశీ భాషల్లోనూ కల్కి చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్. ప్రస్తుతానికైతే ఈ సినిమా ట్రైలర్ పై నెట్టింట బాగానే డిస్కషన్స్ అవుతున్నాయి. అందరు జూన్ 27 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు . చివరికి ఏమౌతుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.