Venkateswarlu
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ‘‘ మంగళవారం’’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ప్రత్యేక ఇంటర్వ్యూలు సైతం ఇస్తున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సైతం పంచుకుంటున్నారు.
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ‘‘ మంగళవారం’’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ప్రత్యేక ఇంటర్వ్యూలు సైతం ఇస్తున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సైతం పంచుకుంటున్నారు.
Venkateswarlu
ఏ రంగంలోనైనా అప్స్ అండ్ డౌన్స్ అన్నవి సర్వ సాధారణం. అయితే ఈ అప్స్ అండ్ డౌన్స్ విషయంలో చిత్ర పరిశ్రమ ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఇక్కడ అప్ చూసిన వాళ్లు డౌన్‌ను తట్టుకోవటం చాలా కష్టం. అది చాలా నరకప్రాయంగా ఉంటుంది. అప్పటి వరకు స్టార్‌డమ్‌ను చూసిన వారు ఉన్నట్టుండి అథఃపాతాళానికి పడిపోతే ఆ బాధ వర్ణణాతీతం. ఇదే విషయాన్ని ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చారు. ఆటుపోట్లు నటులను చాలా బాధకు గురి చేస్తాయని అన్నారు. వాటినుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు.
పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘‘ సినిమా ఇండస్ట్రీలో జర్నీ అనేది స్థిరమైనది కాదు. ఎత్తు పల్లాలు చాలా ఉంటాయి. ఓసారి తారాస్థాయికి చేరుకుంటాము.. ఆ వెంటనే అనుకోని విధంగా కిందపడిపోతాము. నటులకు ఈ ఆటుపోట్లు చాలా బాధని కలిగించే విషయాలు. తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయతలు వెలకట్టలేనివి. తొలి సినిమా ఆర్‌ఎక్స్ 100 నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మంగళవారం సినిమాలో నా పాత్ర మానసికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్లను విసిరింది. మేకప్ కోసమే దాదాపు రెండు గంటల సమయం పట్టేది. ఆ పాత్రతో ఎమోషనల్‌గా జర్నీ చేశాను. ఆ పాత్రనుంచి బయటకు రావటానికి నాకు 15 రోజులు పట్టింది. శైలు అందరి సానుభూతిని పొందుతుంది’’ అని అన్నారు.
కాగా, పాయల్ రాజ్‌పుత్ నటించిన తాజా చిత్రం ‘‘ మంగళవారం’’ విడుదలకు సిద్ధంగా ఉంది. నవంబర్ 17వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి- పాయల్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. చిత్ర బృందం కూడా ప్రమోషన్ల విషయంలో ఎక్కడా రాజీ పడ్డం లేదు. పాయల్ రాజ్‌పుత్ ప్రత్యేక ఇంటర్వ్యూలు సైతం ఇస్తున్నారు. వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంటున్నారు.
మొన్న ఓ ఇంటర్వ్యూలో స్కూల్ టైం లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. ఓ అబ్బాయిని ప్రేమించానని, అతడు తనని రిజెక్ట్ చేశాడని తెలిపారు. లవ్ రిజెక్షన్ కారణంగా 3 నెలల పాటు చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు. తన తల్లి సహకారంతో ఆ బాధనుంచి బయటపడ్డానని అన్నారు. ఇక, ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తానికి ‘మంగళవారం’ఓటీటీ హక్కుల్ని కొన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఎలాంటి రికార్డులు సృష్టించబోతోందో వేచి చూడాల్సిందే. మరి, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న మంగళవారం సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.