Prabhas: ప్రభాస్ అంటే రాజు.. ఆరోజు స్వీపర్స్ కి ఏకంగా రూ.5 లక్షలు ఇచ్చాడట!

ఇండస్ట్రీల ప్రతీ ఒక్కరు గొప్పగా చెప్పే హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలో ప్రభాస్ కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..

ఇండస్ట్రీల ప్రతీ ఒక్కరు గొప్పగా చెప్పే హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలో ప్రభాస్ కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..

ప్రభాస్.. ఈ పేరు చెబితే చాలు ప్రేక్షకులు పులకరిస్తారు.. సాధారణంగా మన దగ్గర నటీనటులకు అభిమానులుంటారు. కానీ అందరూ హీరోల ఫ్యాన్స్ అభిమానించే ఏకైక హీరో డార్లింగ్ ప్రభాస్. సాధారణంగా సినిమా వాళ్లకు తమ అందం, నటన, టాలెంట్ ఇలాంటి విషయాల ఆధారంగా అభిమానులు పుట్టుకొస్తారు. కానీ రెబల్ స్టార్ విషయంలో మాత్రం.. అవేం కారణాలు కావు. సినిమాలు, టాలెంట్, అందం, వీటన్నింటిని మించి ప్రభాస్ ను ప్రేమిస్తారు.. అభిమానిస్తారు. ఇక మిగతా నటీనటులతో పోలిస్తే.. ప్రభాస్ బయట కనిపించడమే చాలా అరుదు. సోషల్ మీడియాలో అసలు ఉండడు. సినిమాలు చేసుకుంటూ పోవడం తప్పితే.. మరో మాటే ఉండదు. అయినా సరే.. అతడంటే జనాలకు విపరీతమైన క్రేజ్, పిచ్చి. ఇతర ఏ హీరోలకు సాధ్యం కానీ విధంగా దేశంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్.

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తనదైన స్టైల్, యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అతడి క్రేజ్ ఆకాశమంత పెరిగింది. దాంతో ప్రభాస్ తదుపరి సినిమాల మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ బాహుబలి పార్ట్ 2 తర్వాత ప్రభాస్ ఖాతాలో అతడి స్థాయికి తగ్గ హిట్ ఒక్కటి లేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి.

అయినా అభిమానులు ప్రభాస్ ను విమర్శించలేదు. కచ్చితంగా మంచి హిట్ సినిమా ఇస్తాడనే భావించారు. వారి అంచనాలను సలార్ సినిమాతో తీర్చేశాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్.. బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తోంది. డే వన్ నుంచే భారీ కలెక్షన్లు రాబడుతూ.. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రభాస్ తో పోటీలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సైతం తేలిపోయాడు. అతడి డంకీ సినిమా.. సలార్ విడుదలతో వెనకబడింది. దేశవ్యాప్తంగా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కు ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. మరి ఇంతలా ప్రభాస్ ను అభిమానించడానికి కారణమేంటి అంటే అతడి వ్యక్తిత్వం. వివాదాలకు దూరంగా ఉండే అతడి నైజం. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు అతడి గురించి పాజిటివ్ గా మాట్లాతరంటే.. అతడి వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

దటీజ్ ప్రభాస్..

ప్రభాస్ గొప్పతనం గురించి చాలామంది చాలా సార్లు చెప్పుకొచ్చారు. అలాంటిదే ఈ సంఘటన. ఒకసారి ఏదో సినిమా ఆఫీసులో కొందరు సెలబ్రిటీలు సరదాగా పేకాట ఆడుతున్నారట. వారిలో ప్రభాస్ కూడా ఉన్నాడు. గేమ్ అయ్యేసరికి డార్లింగ్ 5 లక్షల రూపాయలు గెలిచాడట. ఆ మొత్తాన్ని అతడు తీసుకెళ్లకుండా.. అక్కడ పని చేసిన సర్వర్స్, స్వీపర్లు, డ్రైవర్లకి సమానంగా పంచి ఇచ్చి వెళ్లిపోయాడట. డార్లింగ్ చేసిన పనికి వారందరకి కళ్లల్లో నీళ్లు తిరిగాయట.

అక్కడి వచ్చే చాలా మంది కనీసం తమను మనుషులుగా కూడా చూడరని.. కానీ ప్రభాస్ మాత్రం తమను పిలిచి ఆప్యాయంగా పలకరించడమే కాక ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు ఇచ్చాడని.. ఎంతో సంతోషంగా చెప్పకున్నారట వాళ్లు. డబ్బు సంపాదించడం ఎవరైనా చేస్తారు.. కానీ దాన్ని పంచగలిగే గుణం ఉన్నావాళ్లే గొప్పవాళ్లు. ప్రభాస్ లో ఆ లక్షణం మెండుగా ఉంది కనుకే అతడు అందరూ మెచ్చిన డార్లింగ్ అయ్యాడు.

గతంలో ఇలాంటి రజనీకాంత్ గురించి ఇలాంటి విషయాలు వినే వాళ్లం.. చదివేవాళ్లం. ఆ తర్వాత ప్రభాస్ గురించే ఇలాంటివి వింటున్నాం. ఇక దేశంలోని సినిమా అభిమానులందరూ రజనీకాంత్ ని ప్రేమిస్తారు. ఆ తర్వాత అలాంటి క్రేజ్ సంపాదించుకుంది ఒక్క ప్రభాస్ మాత్రమే.. అతడు ఈ ఇమేజ్ ను ఇలానే కాపాడుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Show comments