nagidream
FEAR Song Lyrics in Telugu From Devera Movie: ఇప్పుడు దేశమంతా ఎదురుచూస్తున్న మూవీల్లో తారక్ దేవర మూవీ ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మాస్ ఆడియన్స్ కి దగ్గరైన తారక్ నటిస్తున్న దేవర సినిమాకి సంబంధించి ఫియర్ సాంగ్ ని విడుదల చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్ చాలా బాగుంది. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఫియర్ సాంగ్ లిరిక్స్ మీ కోసం.
FEAR Song Lyrics in Telugu From Devera Movie: ఇప్పుడు దేశమంతా ఎదురుచూస్తున్న మూవీల్లో తారక్ దేవర మూవీ ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మాస్ ఆడియన్స్ కి దగ్గరైన తారక్ నటిస్తున్న దేవర సినిమాకి సంబంధించి ఫియర్ సాంగ్ ని విడుదల చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్ చాలా బాగుంది. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఫియర్ సాంగ్ లిరిక్స్ మీ కోసం.
nagidream
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న మూవీ దేవర. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ ఊరమాస్ లుక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా? అని చాలా ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఒక పాటను విడుదల చేసింది చిత్ర బృందం. అదే ఫియర్ సాంగ్. ఈ పాట ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అనిరుద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంది.
ఇక ఈ పాటలో వచ్చే విజువల్స్ లో ఎన్టీఆర్ ఊచకోత మామూలుగా లేదు. ఎన్టీఆర్ ఊరమాస్ లుక్ లో ఆకట్టుకుంటుండగా.. దానికి తగ్గట్టు మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. సాధారణంగా ఒక పాట హిట్టో, ఫట్టో తేల్చేది లిరిక్సే. మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం, పాట పాడిన సింగర్ వాయిస్ ఒక ఎత్తు అయితే.. లిరిక్స్ మరొక ఎత్తు. పాటని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడంలో కీలక పాత్ర ఈ లిరిక్స్ దే. లిరిక్స్ కున్న మ్యాజిక్కే వేరు. చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరూ ఈ లిరిక్స్ ని హమ్ చేస్తూ ఉంటారు.
అయితే ఆ పాటను అదే పనిగా వింటేనో.. లేదా లిరిక్స్ సోషల్ మీడియాలో ఎవరో ఒకరు పెడితేనేమో తప్ప లిరిక్స్ ఏంటనేది తెలియదు. పైగా ఇప్పుడు వచ్చే సాంగ్స్ లో లిరిక్స్ ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డామినేట్ చేస్తుంది. దేవర ఫియర్ సాంగ్ పరిస్థితి కూడా అంతే. లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి ఉంటే లిరిక్స్ ఏంటో తెలిసేది. కానీ లిరిక్స్ ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డామినేట్ చేయడంతో అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. అయితే ఫియర్ సాంగ్ లిరిక్స్ తెలుసుకోవాలని మీరు అనుకున్నట్లైతే మీ కోసమే ఈ లిరిక్స్.
అగ్గంటుకుంది సంద్రం
భగ్గున మండే ఆకసం
అరాచకాలు భగ్నం
చల్లారే చెడు సాహసం
జగడపు దారిలో
ముందడుగైన సేనాని
జడుపును నేర్పగా
అదుపున ఆపె సైన్యాన్ని
దూకే ధైర్యమ.. జాగ్రత్త
రాకే.. తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత.. దాక్కో…వే..
కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయ్యి
కలుగుల్లో దూరే…..నే….ఏ…
దూకే ధైర్యమ.. జాగ్రత్త
రాకే.. తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత
రాకే.. తెగబడి రాకే
జగతికి చేటు చేయనేల
దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే పెళ పెళ
కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యిందివేళ
విధికే ఎదురై వెళితే విల విలా
అలలయే ఎరుపు నీళ్ళే
ఆ కాళ్ళను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా
దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే
మృత్యువుకైన ముచ్చెమట
దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే.. తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయ్యి
కలుగుల్లో దూరెనే
దూకే ధైర్యమ జాగ్రత్త
రాకే.. తెగబడి రాకే