ఏ బాలీవుడ్ మూవీకి సాధ్యం కాలేదు.. కానీ 12th ఫెయిల్ సాధించింది

బాలీవుడ్ నాట బడా సినిమాలే కాదూ.. చిన్న మూవీ కూడా సత్తా చాటగలదని నిరూపించిన చిత్రం 12th ఫెయిల్. ఈ మూవీ ఎంతటి సెన్సేషనల్ హిట్ కొట్టిందో తెలుసు. మొన్న ఫిల్మిం ఫేర్ అవార్డుల్లో బెస్ట్ ఫిల్మిం అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో రికార్డును సృష్టించింది.

బాలీవుడ్ నాట బడా సినిమాలే కాదూ.. చిన్న మూవీ కూడా సత్తా చాటగలదని నిరూపించిన చిత్రం 12th ఫెయిల్. ఈ మూవీ ఎంతటి సెన్సేషనల్ హిట్ కొట్టిందో తెలుసు. మొన్న ఫిల్మిం ఫేర్ అవార్డుల్లో బెస్ట్ ఫిల్మిం అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో రికార్డును సృష్టించింది.

ఎటువంటి హడావుడి లేకుండా చిన్న సినిమా వచ్చి.. ప్రభంజనం సృష్టించడమే కాదూ కలెక్షన్ల వర్షం కురిపించిన బాలీవుడ్ చిత్రం 12th ఫెయిల్. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా ఈ తెరకెక్కించిన ఈ చిత్రం వసూళ్ల కన్నా ముఖ్యంగా ప్రశంసలు ఎక్కువగా అందుకుంది. బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ ఈ మూవీకి డైరెక్టర్. అక్టోబర్ 27న విడుదలైన ఈ మూవీ ఓటీటీలో కూడా దూసుకుపోతుంది. థియేటర్లలో కన్నా ఓటీటీలోకి వచ్చాకే ఈ సినిమాకు ఎక్కువ పేరు వచ్చింది. విక్రాంత్ మాస్సే, మేథా శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమా 69వ ఫిలిం ఫేర్ అవార్డుల్లో కూడా ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు.. పలు అవార్డులను కొల్లగొట్టింది.

12th ఫెయిల్ తాజాగా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సెలబ్రేట్ చేసుకుంది. అంతే కాదూ ఈ మూవీ హీరో విక్రాంత్ మాస్సేకు తండ్రిగా ప్రమోట్ కూడా అయ్యాడు. ఇప్పుడు ఈ చిత్రం సెన్సేషనల్ రికార్డులను సృష్టిస్తోంది. ఐఎండీబీ ఆల్ టైమ్ గ్లోబల్ బెస్ట్ సినిమాల జాబితాలో ఈ చిత్రం 50వ స్థానాన్ని దక్కించుకుంది. ఆల్ టైమ్ గ్లోబల్ 250 జాబితాలో ఈ స్థానం సంపాదించడం విశేషం. గ్లోబల్ టాప్-50 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ చిత్రంగా నిలవడం గమనార్హం. ఈ విషయాన్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా కూడా వెల్లడించాడు. ఐఎండీబీ ఆల్ టైమ్ టాప్-250లో ఈ మూవీకి 9.2 రేటింగ్ దక్కిందని తెలిపారు.

సినిమా పారాడిసో అనే మూవీ 49వ స్థానంలో నిలువగా.. 12th ఫెయిల్ 50వ స్థానం దక్కించుకుంది. ఈ మూవీ చేస్తున్నప్పుడు థియేటర్లలో కాకుండా.. ఓటీటీలో విడుదల చేయమంటూ తన భార్యతో పాటు పలువురు సలహాలిచ్చారని ఓ సందర్భంగా పేర్కొన్నాడు దర్శకుడు. ఇప్పుడు అలాంటి సినిమా థియేటర్లలో విడుదలై.. బీటౌన్ బాక్సాఫీసును షేక్ చేయడంతో పాటు వసూళ్లు, ప్రశంసలు దక్కాయి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే.. ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఓ అబ్బాయి.. 12వ తరగతి ఫెయిలై.. మళ్లీ పాసై.. ఐపీఎస్ అయ్యేందుకు ఎన్ని కష్టాలు, ఒడిదుడుకుల పడ్డాడు అన్నదే కథ. అనురాగ్ పాఠక్ రాసిన 12 th ఫెయిల్ పుస్తకం ఆధారంగా.. ఈ మూవీ తెరకెక్కింది.

Show comments