ఓటీటీలకు మూవీ లవర్స్ ఎంతగా అలవాటు పడ్డారో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. కొవిడ్ టైమ్‌లో ఓటీటీల హవా మొదలైంది. సినిమా థియేటర్లు క్లోజ్ అవడంతో ఆడియెన్స్ ఓటీటీల్లో తమకు నచ్చిన మూవీస్, వెబ్ సిరీస్‌లు చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇండియన్ మూవీస్‌తో పాటు ఫారెన్ కంటెంట్‌ను కూడా ఎక్కువగా చూశారు. దీంతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఒక్కసారిగా సబ్‌స్రైబర్స్ పెరిగిపోయారు. కరోనా వెళ్లిపోయినా ఇంకా ఓటీటీల హవా నడుస్తోంది. సినిమాలకు హిట్ లేదా సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూడటం తగ్గిపోయింది.
మూడ్నాలుగు వారాల్లోనే కొత్త చిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. వెబ్ సిరీస్‌లు ఎలాగూ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనే స్ట్రీమింగ్ అవుతాయి. కాబట్టి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకునేందుకు ఆడియెన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అత్యధిక సబ్‌స్ర్కైబర్స్ ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లిస్టులో నెట్‌ఫ్లిక్స్ ముందు వరుసలో ఉంటుంది. హాలీవుడ్‌తో పాటు ఇతర విదేశీ భాషల కంటెంట్ నెట్‌ఫ్లిక్స్‌లోనే ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. అందుకే ఫిల్మీ గోయర్స్ దీని సబ్స్క్రిప్షన్ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే తమ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్ ఇవ్వనుందని సమాచారం.
నెట్‌ఫ్లిక్స్ త్వరలో లేదా వచ్చే ఏడాది సబ్స్క్రిప్షన్ ధరల్ని పెంచే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. నెట్‌ఫ్లిక్స్ ధరల పెంపు మీద గతంలో వచ్చిన రిపోర్టుల్ని ఉటంకిస్తూ అవి నిజమేనంటూ తన తాజా కథనంలో వాల్‌స్ట్రీట్ హైలైట్ చేసింది. అయితే సబ్స్క్రిప్షన్ మార్పులపై క్లారిటీ లేదు. కానీ అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ముందుగా ధరల పెంపు ఉంటుందని మాత్రం తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం ఇండియాకు వర్తిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, గతేడాది సబ్స్క్రిప్షన్ రేట్స్‌ను పెంచిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు మరోమారు అలాంటి డెసిజన్ తీసుకోవడంపై యూజర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: నడిరోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి.. CPR చేసి బతికించిన నటుడు!