OTT లో 65 మంది ట్విన్స్ నటించిన క్రైమ్ థ్రిల్లర్.. డోంట్ మిస్

OTT Suggestions: OTT లో ఈ వారం చాలానే తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. కామెడి , క్రైమ్ , సస్పెన్స్ , హారర్ ఇలా అన్ని జోనర్స్ ప్రేక్షకుల ముందు ఉన్నాయి. కాబట్టి ఎవరికీ నచ్చింది వాళ్ళు ఎంచుకోవడమే లేట్. ఈ క్రమంలో ఈ వారం రిలీజ్ అయినా సినిమాలలో నవీన్ చంద్ర లెవెన్ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

OTT Suggestions: OTT లో ఈ వారం చాలానే తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. కామెడి , క్రైమ్ , సస్పెన్స్ , హారర్ ఇలా అన్ని జోనర్స్ ప్రేక్షకుల ముందు ఉన్నాయి. కాబట్టి ఎవరికీ నచ్చింది వాళ్ళు ఎంచుకోవడమే లేట్. ఈ క్రమంలో ఈ వారం రిలీజ్ అయినా సినిమాలలో నవీన్ చంద్ర లెవెన్ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

OTT లో ఈ వారం చాలానే తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. కామెడి , క్రైమ్ , సస్పెన్స్ , హారర్ ఇలా అన్ని జోనర్స్ ప్రేక్షకుల ముందు ఉన్నాయి. కాబట్టి ఎవరికీ నచ్చింది వాళ్ళు ఎంచుకోవడమే లేట్. ఈ క్రమంలో ఈ వారం రిలీజ్ అయినా సినిమాలలో నవీన్ చంద్ర లెవెన్ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. సినిమా మొత్తం ట్విస్ట్ లు , టర్నింగ్ పాయింట్స్ ఏ ఉంటాయి. ఎలాగూ థియేటర్ లో రీరిలీజ్ లు తప్ప కొత్త సినిమాలు ఏవి లేవు కాబట్టి.. బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే మాత్రం లెవెన్ మూవీ బెస్ట్ ఛాయస్

ఈ సినిమా కథ విషయానికొస్తే.. విశాఖ‌లో అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వ‌ర్తిస్తుంటాడు న‌వీన్‌చంద్ర‌. అతనికి డిపార్ట్మెంట్ లో మంచి పేరు ఉంటుంది . ఒకసారి న‌గరంలో వ‌రుస హ‌త్య‌లు క‌ల‌క‌లం సృష్టిస్తాయి. మొదట ఆ కేసును రంజిత్ అనే అధికారి హ్యాండిల్ చేస్తాడు. కానీ అతను ఓ రోడ్ యాక్సిడెంట్ కు గురి అవ్వడంతో.. ఆ బాధ్యతను అరవింద్ తీసుకుంటాడు. అయినా సరే ఆ వరుస హత్యలు జరుగుతూనే ఉంటాయి. కొంతకాలానికి విచారణలో బయట పడింది ఏంటంటే ఆ చనిపోయిన వారంతా కవలలు అని. పైగా ఆ ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే చంపుతున్నారని తెలుస్తుంది. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు ? ఎందుకు ట్విన్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ? నవీన్ చంద్ర ఈ కేస్ ను ఎలా సాల్వ్ చేశారు ? చివరి ఏమైందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాలో హైలెట్ పాయింట్ ఏంటంటే ఒకే సినిమాలో 65 మంది కవలలు నటించడం. హ‌త్య‌ల వెన‌క ఎవ‌రున్నార‌నే ఉత్కంఠని ఒక‌వైపు రేకెత్తిస్తూ… మ‌రోవైపు అనూహ్య‌మైన మ‌లుపులతో సాగే సినిమా ఇది. వ‌రుస‌గా ఒకే ర‌క‌మైన హ‌త్య‌లు, వాటి వెన‌క ఓ మాస్ట‌ర్ మైండ్ ఉండ‌టం, అత‌నెవ‌రో క‌నుక్కునేందుకు పోలీస్ ఇన్వెస్టిగేష‌న్ మొద‌లుపెట్ట‌డం… ఈ నేప‌థ్యం చాలా సినిమాల్లో చూసిందే. అయినా సరే సినిమా చూస్తున్నంత సేపు అలాంటి ఫీల్ కలగకుండా చాలా ఎంగేజింగ్ గా ఉంచుతుంది. ఈ సినిమా ప్రస్తుతం ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments