Naga Vamsi: టిల్లు స్వ్కేర్‌ కలెక్షన్స్‌పై నాగవంశీ ఆసక్తి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎంత అంచనా వేశాడంటే!

నిన్న మొన్నటి వరకు విపరీతమైన బజ్ క్రియేట్ అయిన టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా గురించి ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ ఏ వినిపిస్తుంది. అయితే, ఈ క్రమంలో ప్రొడ్యూసర్ నాగవంశీ టిల్లు స్క్వేర్ సినిమాపై కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిన్న మొన్నటి వరకు విపరీతమైన బజ్ క్రియేట్ అయిన టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా గురించి ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ ఏ వినిపిస్తుంది. అయితే, ఈ క్రమంలో ప్రొడ్యూసర్ నాగవంశీ టిల్లు స్క్వేర్ సినిమాపై కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు.

మార్చి 29న భారీ అంచనాల మధ్యన.. గ్రాండ్ గా టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ అయింది. యూఎస్ ప్రీమియర్స్ దగ్గర నుంచి.. అలాగే ఈరోజు విడుదలైన మొదటి షో నుంచి ఇప్పటి వరకు కూడా.. ఈ సినిమా గురించి పాజిటివ్ బజ్ నడుస్తుంది. నిజానికి టాలీవుడ్ లో విడుదలైన ఒరిజినల్ సినిమాలలో సంక్రాంతికి వచ్చిన .. హనుమాన్ తప్ప మరే సినిమా కూడా.. ప్రేక్షకులను థియేటర్స్ కు అంత ఇంట్రెస్టింగ్ గా రప్పించలేకపోయింది. హనుమాన్ తర్వాత ఇంత ఎక్సైట్మెంట్ తో అందరు థియేటర్స్ కు వెళ్లిన సినిమా “టిల్లు స్క్వేర్” మాత్రమే. కాబట్టి సంక్రాంతి తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద.. రికార్డులు సృష్టించబోయే సినిమా “టిల్లు స్క్వేర్”ఏ అంటూ .. ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

డీజే టిల్లు సినిమాతో టీ టౌన్ లో యునానిమస్ టాక్ సంపాదించుకున్న తర్వాత .. ఇప్పుడు మళ్ళీ ‘టిల్లు స్క్వేర్’ చిత్రంతో అంతకు మించిన క్రేజ్ ను క్రియేట్ చేయబోతుంది. ఈ చిత్రానికి రూ.23.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి టిల్లు స్క్వేర్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.24 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “ఈరోజు మార్నింగ్ షో నుంచి.. మ్యాట్నీ వరకు వచ్చిన గ్రోత్ ని బట్టి చూసుకుంటే.. వచ్చే వారం ఉగాది, రంజాన్ కూడా వస్తున్నాయి కాబట్టి.. ఇక ఏప్రిల్ లో కూడా రిలీజ్ అయ్యే సినిమాలు లేవు కాబట్టి .. టిల్లు స్క్వేర్ 100 కోట్ల గ్రాస్ చేస్తదని ఎస్టిమేషన్ నాకు”.. అంటూ చెప్పుకొచ్చారు. దీనితో ఈ సినిమాపై వారికున్న కాన్ఫిడెన్స్ ఏంటో క్లియర్ గా అందరికి అర్థమైపోతుంది. కాబట్టి ఆడియన్స్ అంచనాలను ఈ సినిమా నిలబెట్టుకుంది చెప్పి తీరాలి.

ఇక నిర్మాత వ్యాఖ్యానించిన విషయంలో కూడా నిజం లేకపోలేదు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు అయిపోయే సమయం, పండుగల కారణంగా ఉద్యోగులకు సెలవలు, పైగా మరే సినిమాలు కూడా రిలీజ్ కు సిద్ధంగా లేకపోవడం.. ఇలా అన్ని టిల్లుకు ఎంచక్కా కలిసి వచ్చేశాయ్ అని చెప్పి తీరాలి. కాబట్టి నాగవంశి చెప్పినట్లుగా .. టిల్లు స్క్వేర్ థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు.. 100 కోట్ల గ్రాస్ చేయడం పక్కాగా జరుగుతుంది. సో టిల్లు స్క్వేర్ ఈసారి ఖచ్చితంగా డీజే టిల్లు బ్రాండ్ ను నిలబెడుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక టిల్లు స్క్వేర్ ను కొత్త దర్శకుడు తీసినప్పటికీ.. ప్రేక్షకులకు కావాల్సిన స్టఫ్ అందించడంలో మాత్రం ఏ మాత్రం రాజీ పడలేదు అని చెప్పి తీరాలి. మరి డే 1 తర్వాత ఓవరాల్ గా .. టిల్లు గురించి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments