Naga Chaitanya Sobhita Dhulipala Engagement-Her Background: నాగ చైతన్యకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ బ్యాగ్రౌండ్‌ తెలుసా? మన తెనాలిలో పుట్టి!

Sobhita Dhulipala: నాగ చైతన్యకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ బ్యాగ్రౌండ్‌ తెలుసా? మన తెనాలిలో పుట్టి!

Naga Chaitanya Sobhita Dhulipala Engagement: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థం అయిపోయింది. ఈ క్రమంలో ఆమె బ్యాగ్రౌండ్‌ గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..

Naga Chaitanya Sobhita Dhulipala Engagement: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థం అయిపోయింది. ఈ క్రమంలో ఆమె బ్యాగ్రౌండ్‌ గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..

అందరూ అనుకున్నదే నిజం అయ్యింది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారు.. ప్రేమించుకుంటున్నారు అంటూ గత కొన్నాళ్లుగా వచ్చిన రూమర్లు నిజం అయ్యాయి. ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని.. తమ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. నేడు అనగా ఆగస్టు 8, గురువారం నాడు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నాగ చైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. నిశ్చితార్థం ఫొటోలను షేర్‌ చేస్తూ.. నాగార్జున చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక అభిమానులు వీరికి శుభకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది శోభిత ధూళిపాళ బ్యాగ్రౌండ్‌ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే.. శోభిత తెలుగమ్మాయి. తెనాలిలో జన్మించింది. వైజాగ్‌లోనే పెరిగింది. ఆమె గురించి అనేక ఆసక్తికర విషయాలు మీకోసం..

శోభిత ధూళిపాళ తెలుగమ్మాయి. 1992, మే 31న ఆంధ్రప్రదేశ్‌, తెనాలిలో జన్మించింది. ఆమె తండ్రి వేణుగోపాల్‌ రావు విశాఖపట్నంలో నేవీ ఇంజనీర్‌గా పని చేసేవారు. తల్లి.. శాంతా కామాక్షి స్కూల్‌ టీచర్‌. ఇక శోభిత బాల్యం అంతా వైజాగ్‌లోనే గడిచింది. చదువు కోసం వైజాగ్ నుండి ముంబై వెళ్లింది. అక్కడ కార్పొరేట్ లా కోర్స్‌లో చేరింది. ఇక శోభితకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌, మోడలింగ్‌ అంటే ఇష్టం. ఈ క్రమంలోనే 2010లో నేవీ నిర్వహించే అందాల పోటీల్లో పాల్గొనడమే కాక.. నేవీ క్వీన్‌గా కిరీటం దక్కించుకుంది. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ముందుగా 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్‌ మూవీతో ఎంట్రీ..

బాలీవుడ్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శోభిత. 2016లో అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన ‘రామన్ రాఘవ్ 2.0’ అనే హిందీ సినిమాతో తన యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది. ఈ సినిమాలో తను విక్కీ కౌశల్ సరసన నటించింది. తొలి చిత్రంలోనే సూపర్బ్‌గా యాక్ట్‌ చేసి అందరినీ కట్టిపడేసింది శోభిత. ఈ సినిమా విజయం ఆమెకు బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలతో పాటు.. టాలీవుడ్‌ డెబ్యూ ఛాన్స్‌ కూడా ఇచ్చింది. రామన్‌ రాఘవ్‌ విజయం తర్వాత శోభిత వరుసగా.. అక్షత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాలకాండి’, రాజా మీనన్ దర్శకత్వంలో ‘చెఫ్’లో కీలక పాత్రల్లో కనిపించింది. ఆ తర్వాత అడవి శేష్ ‘గూఢచారి’తో తెలుగులో కూడా అడుగుపెట్టింది.

ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే వెబ్ సిరీస్‌లలో యాక్ట్‌ చేయడం ప్రారంభించింది. 2019లో విడుదలయిన ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే వెబ్‌సిరీస్‌.. శోభితను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. అలా తెలుగు, హిందీలో బిజీ అయిన ఆమెకు తమిళ, మలయాళం నుండి కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’లో శోభిత ధూళిపాళ తన నటనతో మెప్పించింది.

ఎక్కువగా తెలుగు, హిందీలో సినిమాల్లో నటించి మెప్పించిన శోభిత.. ఈమధ్యే హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 2023లో హాలీవుడ్ హీరో దేవ్ పటేల్ నటించి డైరెక్ట్ చేసిన ‘మంకీ మ్యాన్’ సినిమాతో మొదటిసారి హాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఇక ఇప్పుడు అక్కినేని కోడలిగా మారింది. ఈ క్రమంలో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Show comments