మమ్ముట్టి ప్రయోగం భ్రమయుగం.. టైటిల్ కి తగ్గట్లే ట్రైలర్ లో కూడా..!

Bramayugam Movie Trailer Review: మమ్ముట్టి మరో ప్రయోగం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఆ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు.

Bramayugam Movie Trailer Review: మమ్ముట్టి మరో ప్రయోగం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఆ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు.

మమ్ముట్టి పేరు వినగానే అందరికీ ప్రయోగాలే గుర్తొస్తాయి. నేను ఒక స్టార్ హీరోని.. 70 ఏళ్ల వయసులో ఉన్నాను అని కూడా చూడకుండా ఇప్పటికీ మమ్ముట్టి తనదైనశైలిలో ప్రయోగాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇటీవలే “కాథల్: ది కోర్” అనే మూవీలో గే పాత్రలో కనిపించారు. ఇప్పుడు భ్రమయుగం అనే సినిమాతో మరో ప్రయోగానికి.. కాదు కాదు సాహసానికి సిద్ధమైపోయారు అనే చెప్పాలి. తాజాగా భ్రమయుగం సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మరి.. ట్రైలర్ ఎలా ఉంది? ఈ ప్రయోగం వర్కౌట్ అవుతుందా లేదా? అసలు ట్రైలర్ చెప్పిన కథ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం.

ఇప్పుడు అన్నీ కలర్ సినిమాలు అయిపోయాయి. ఈ జనరేషన్ వాళ్లకి బ్లాక అండ్ వైట్ సినిమాలు అంటే తెలియదనే చెప్పాలి. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీ సూపర్ బ్లాక్ బస్టర్ చిత్రమైన మాయాబజార్ ని ఈ తరం కోసం కలర్ గా మార్చి చూపించారు. అలాంటి ఇప్పుడు మమ్ముట్టి ఒక ఫుల్ లెంగ్త్ బ్లాక్ అండ్ చిత్రం చేస్తున్నాడని తెలియగానే ఇండస్ట్రీ కూడా ఒకింత షాక్ తినింది. ఆయన ఆ ప్రయోగాన్ని చేయడం మాత్రమే కాకుండా.. ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చే విధంగానే ఉంది. ఇందులో మమ్ముట్టి నటన కంటే కూడా అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భారతన్ పాత్రలే ఎక్కువ కనిపిస్తాయి.

ఒకటే డైలాగ్ రిపీటెడ్ గా వినిపిస్తూ ఉంటుంది. “ఇవి పావులు.. ఇవి రెండూ పాచికలు పడ్డ సంఖ్యను బట్టి పావుని జరపాలి. ముందు ఇక్కడికి చేరిన వాళ్లు గెలిచినట్లు అర్థం. దానికి భాగ్యం ఉండాలి” అంటూ చెప్పిన డైలాగ్ నే మార్చి మార్చి చెప్పారు. చెప్పిన ప్రతిసారి కొన్ని సీన్స్ ని చూపించారు. మార్వెల్ చిత్రాలు చూసేవాళ్లకు.. డాక్టర్ స్ట్రేంజ్ వివన్ ని చంపడానికి ఒకే టైమ్ లూప్ లో రిపీటెడ్ గా వస్తూ ఉంటాడు. అలాంటి ఒక టైమ్ లూప్ స్టోరీ ఇది అనిపిస్తోంది. ఒక పాడుబడిన ఇంట్లో బంధించబడి.. అక్కడి నుంచి తప్పించుకునేందుకు దారి దొరక్క అల్లాడుతున్నట్లు అనిపిస్తోంది. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమనే చెప్పాలి. అది నిజం అయినా కూడా ఇలాంటి ఒక స్టోరీని టచ్ చేయడం సాహసం అనే చెప్పాలి.

ఇది మొదటికే బ్లాక్ అండ్ వైట్ చిత్రం అంటున్నారు. ఆ తర్వాత స్టోరీ కూడా ఇలా ఉంటే.. సినిమా రిజల్ట్ అనేది 50- 50 ఛాన్స్ అనే చెప్పాలి. స్టోరీ ప్రేక్షకులకు అర్థం అయితే నెత్తిన పెట్టుకుంటారు. ఏ కొంచం కన్ఫూజన్ అనిపించినా కూడా మొత్తం రిజల్ట్ మారిపోతుంది. అందుకే మమ్ముట్టి ఒక పెద్ద సాహసం చేస్తున్నారు అని చెప్తోంది. ట్లైలర్ మాత్రం ఆసక్తిగానే సాగింది. కెమెరా వర్క్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమా మీద ఈ ట్రైలర్ అంచనాలు పెంచిందనే చెప్పాలి. కానీ, ఈ భ్రమయుగం ప్రయోగం ఎండ్ రిజల్ట్ మాత్రం థియేటర్ లోకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఈ మొత్తం 5 భాషల్లో తెరకెక్కుతోంది. మరి.. మమ్ముట్టి భ్రమయుగం ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments