అప్పుడే #SSMB 30 బజ్ .. ఈసారి ఛాన్స్ ఎవరికంటే !!

SSMB30 Update : జక్కన్న మహేష్ కాంబినేషన్ లో మూవీ ఎప్పటికి రెడీ అవుతుందో ఇంకా క్లారిటీనే లేదు. కానీ అప్పుడే SSMB 30 గురించి టాక్ మొదలైంపోయింది. అదేంటో చూసేద్దాం

SSMB30 Update : జక్కన్న మహేష్ కాంబినేషన్ లో మూవీ ఎప్పటికి రెడీ అవుతుందో ఇంకా క్లారిటీనే లేదు. కానీ అప్పుడే SSMB 30 గురించి టాక్ మొదలైంపోయింది. అదేంటో చూసేద్దాం

సహజంగా రాజమౌళితో సినిమా అంటే అది ఎన్నాళ్ళు పడుతుందో ఎవరికీ తెలీదు. దానికి తోడు జక్కన్న ప్రాజెక్ట్ తర్వాత ఆ హీరోతో ఏ దర్శకుడు వర్క్ చేయాలన్న ఆచి తూచి అడుగు వేయాల్సిందే. అందుకే ఇప్పటినుంచి SSMB 30 దర్శకుడు ఎవరా అనే ఆసక్తి అందరిలో మొదలైంది. SSMB 29 తర్వాత సూపర్ స్టార్ గ్లోబల్ స్టార్ గా మారిపోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. జక్కన్న దర్శకత్వంలో సినిమా అంటే టైటిల్ కార్డు నుంచి ఎండ్ కార్డు వరకు అంత మ్యాజికల్ గానే ఉంటుంది. ఇక హీరోల మేక్ ఓవర్ లా గురించైతే తెరిచిన పుస్తకమే. హీరోల హిస్టరీలో రాజమౌళి సినిమాకు ముందు రాజమౌళి సినిమాకు తర్వాత అని అంతా చెప్పుకుంటూ ఉంటారు. SSMB 29 మీద అందరి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆల్రెడీ ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఈ సినిమా హిట్ ఆ ఫట్ ఆ అనే మాటలు ఎక్కడ వినబడవు. కేవలం ఇండియను మూవీ మార్కెట్ మూవీ రూపు రేఖలను ఈ సినిమా ఎలా చేంజ్ చేస్తుంది అనే ఊహాగానాలే అంతా పెరిగిపోయాయి. ఈ సినిమా సంగతి ఏమో కానీ ఇప్పుడు SSMB 30 గురించి అంతా తెగ మాట్లాడుకుంటున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు ముఖ్యంగా నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి. యానిమల్ తో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగ , పుష్ప తో రికార్డ్స్ బద్దలు కొట్టిన సుకుమార్ , అలాగే హను రాఘవపూడి , బుచ్చి బాబు. వీరిలో ఆల్రెడీ సుకుమార్ గతంలో మహేష్ వన్ సినిమాకు వర్క్ చేసారు. కానీ అది అంత సరైన రిజల్ట్ ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో ఇంకా ఏ సినిమా రాలేదు. కానీ సుకుమార్ క్రియేటివిటికీ మహేష్ ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. అలాగే మార్కెట్ లో హను రాఘవపూడి కాన్సెప్ట్స్ కు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందుకే డార్లింగ్ కూడా ఇంత బిజీ షెడ్యూల్ లో ఈ దర్శకుడికి డేట్స్ ఇచ్చాడు. ఒకవేళ ఈ దర్శకుడు కనుక మహేష్ ను అప్రోచ్ అయితే.. హనుకు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇలా మహేష్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ విషయాల్లో టాప్ డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక SSMB 29 అప్డేట్స్ విషయానికొస్తే ప్రస్తుతం మూవీ టీం రెస్ట్ మోడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వన్స్ జక్కన మహేష్ సెట్ లో కి ఎంట్రీ ఇస్తే కానీ వరుస అప్డేట్స్ బయటకు రావు. ఇక ఈ ఈసినిమా ఎప్పటికి అవుతుందో.. ఆ తర్వాత మహేష్ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో అని బాబు ఫ్యాన్స్ అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై ఎదో ఓ క్లారిటీ వచ్చేలా ఉంది. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments