Hanuman Movie: జనవరి 22 రామాలయం ప్రారంభోత్సవం….జనవరి 12 హనుమాన్ విడుదల

యోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం జనవరి 22 వ తేదీ అని ప్రపంచవ్యాప్తంగా అందరి గుండెల్లో నాటుకుపోయింది. అదే సమయంలో హనుమాన్ సినిమా విడుదల కావడం.. వారికి కలిసి వస్తుంది అంటున్నారు. ఎలా అంటే

యోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం జనవరి 22 వ తేదీ అని ప్రపంచవ్యాప్తంగా అందరి గుండెల్లో నాటుకుపోయింది. అదే సమయంలో హనుమాన్ సినిమా విడుదల కావడం.. వారికి కలిసి వస్తుంది అంటున్నారు. ఎలా అంటే

అందరి కన్నా ముందుగానే అన్నికార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదల తేదీ ప్రకటించినప్పటికీ, మళ్లీ మళ్ల ఒత్తిడి హనుమాన్ సినిమా మీదకే వస్తోంది. సంక్రాంతి రిలీజుల విషయంలో ఐదు సినిమాలు బరిలోకి దిగి పోటీ పడుతుంటే అందులో ఒక్క హనుమాన్ డేట్ నే ఎలాగైనా మార్పించాలనే ప్రయత్నాలైతే మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం చాలా స్ట్రాంగ్ గా, పట్టుదలతోనే నిలబడుతున్నాడు జనవరి 12నాడే తన సినిమా రిలీజని తెగేసి చెబుతున్నాడు. కానీ చివరి క్షణం ఆశ కొందరిలో చావడం లేదు.

నిజానికి రిలీజ్ డేట్ కూడా ఫ్రశాంత్ వర్మే జనవరి 12 అని ఆదికి ముందుగానే అనౌన్స్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ, మరో పక్క గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా, ఈగల్ కూడా దాదాపు అటూ ఇటుగా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో హనుమాన్ సినిమా ఒక్కటే అమ్మకు చిక్కిన మేకలా కనిపిస్తోంది. పెద్ద హీరో కాదు, పెద్ద డైరెక్టర్ కాదు, పెద్ద బ్యానర్ అసలే కాదు.. ఇక దిక్కెవడు హనుమాన్ కి.

కానీ, సినిమా రిపోర్ట్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉంది. అదే ఎక్కువగా అందరినీ భయపెడుతోంది. పైగా హనుమంతుడిని మించిన మాస్ హీరో ఎక్కడా, ఎప్పుడూ లేడు. పైగా మొన్న్ మధ్య ఎప్పుడైతే ట్రైలర్ విడుదలయిందో అక్కడ్నుంచీ హనుమాన్ వ్యవహరమే పూర్తిగా మారిపోయింది. అయితే జనవరి 12న విడుదల తేదీని ముందుగానే ప్రకటించడంలో మరో పాయంట్ కూడా ఉంది.

అక్కడ అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం జనవరి 22 వ తేదీ అని ప్రపంచవ్యాప్తంగా అందరి గుండెల్లో నాటుకుపోయింది. రామభక్తుడైన హునుమాన్ పేరున విడుదలవుతున్న సినిమాకి జస్ట్ ఒక్క వారం ముందు అంటే రామాలయం ప్రారంభోత్సవానికి వారం రోజుల ముందు హనుమాన్ రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా అనేకానేక భాషలలో విడుదలయ్యే సువర్ణాకాశాన్ని హనుమాన్ నిర్మాతలు, దర్శకుడు, మొత్తం టీం మిస్ కాలేరని, ఇంత కన్నా మంచి డేట్ హనుమాన్ సినిమాకి మరొకటి లేదని మరొక పాన్ ఇండియా నిర్మాత కామెంట్ చేశారు.

హనుమాన్ సినిమాకు సంబంధించినంత వరకూ కూడా సంక్రాంతి రిలీజ్ అనే పాయంట్ కన్నా కూడా రామాలయం ప్రారంభోత్సవానికి వారం రోజుల ముందు సందడిని, సంబరాలను అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాన్ని హనుమాన్ టీం ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోలేదనేది గట్టిగా వినిపిస్తున్న మాట. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, మరాఠీ, హిందీ, స్పానిష్, చైనీస్, జపాన్, ఇంగ్లీష్, కొరియన్ భాషలలో మూకమ్మడిగా విడుదల కావడానికి రంగం సిద్ధం చేసుకున్న హనుమాన్ విజయఢంకా మోగిస్తుందని ఆశిద్దాం.

Show comments