నిన్న లాస్ట్ బాల్ సిక్స్ కొట్టిన సజనా.. ఓ తెలుగు సినిమాలో హీరోయిన్!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్ లోనే లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి టీమ్ ను గెలిపించింది సజనా సజీవన్. దీంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. అయితే సజనా ఓ తెలుగు మూవీలో నటించిందని మీకు తెలుసా? ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్ లోనే లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి టీమ్ ను గెలిపించింది సజనా సజీవన్. దీంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. అయితే సజనా ఓ తెలుగు మూవీలో నటించిందని మీకు తెలుసా? ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 2 ఫిబ్రవరి 23(శుక్రవారం) అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ వర్సెస్ డిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. తొలి మ్యాచ్ లోనే క్రికెట్ లవర్స్ కు అసలైన మజాను అందించింది ఈ మ్యాచ్. నరాలుతెగే ఉత్కంఠతతో సాగిన ఈ పోరులో చివరి బంతికి సిక్సర్ కొట్టి ముంబై ఇండియన్స్ ను గెలిపించింది సజనా సజీవన్. దీంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఒకే ఒక్క బాల్ తో లేడీ ధోనిగా ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఆమె గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సజన ఓ తెలుగు సినిమాలో నటించిందని మీకు తెలుసా? మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సజనా సజీవన్.. ప్రస్తుతం లేడీ ఉమెన్స్ క్రికెట్ లో ఓ సంచలనం. తాజాగా ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో జరిగిన తొలి మ్యాచ్ లో లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి ముంబై ఇండియన్స్ టీమ్ ను గెలిపించింది. ఈ సీజన్ కోసం సజనాను ముంబై యాజమాన్యం రూ. 15 లక్షలకు కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్ లోనే బెస్ట్ ఫినిషర్ గా గుర్తింపుతెచ్చుకుని లేడీ ధోనిగా కితాబు అందుకుంటోంది. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగింది సజనా. ఆమె తండ్రి ఓ రిక్షావాలా అయినప్పటికీ మెుక్కవోని దీక్షతో తన కలను నెరవేర్చుకుంది.

ఇదంతా కాసేపు పక్కనపెడితే.. సజనా ఓ తెలుగు సినిమాలో నటించిందని మీకు తెలుసా? శివకార్తికేయన్, ఐశ్వర్య రాజేష్, రాజేంద్రప్రసాద్ కీలకపాత్రల్లో నటించిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో సజనా సజీవన్ సజన పాత్రలో నటించింది. 11 మంది లేడీ క్రికెటర్లలో ఆమె ఒక ప్లేయర్ గా నటించింది. లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి ముంబై టీమ్ కు అద్భుతమైన విజయాన్ని అందించింది. భీమినేని శ్రీనివాస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

ఇక సజన తెలుగు సినిమాలో నటించిన విషయం తెలిసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీమ్ గెలవాలంటే చివరి బంతికి 5 పరుగులు కావాలి. ఈ దశలో సజనా లాస్ట్ బాల్ కు సిక్సర్ బాది అద్బుత విజయాన్ని అందించింది. మరి మీలో ఎంతమందికి సజనా తెలుగు సినిమాలో నటించిందని తెలుసు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: తండ్రి రిక్షావాలా.. కూతురు ధోనిని మించిన మ్యాచ్‌ ఫినిషర్‌! ఎవరీ సజనా

Show comments