Oscar 2025: ‘లాపతా లేడీస్’ అరుదైన ఘనత.. 2025 ఆస్కార్ బరిలోకి

Laapataa Ladies Movie officially entry Oscar 2025: చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించిన 'లాపతా లేడీస్' మూవీ.. తాజాగా మరో ఘనతను సాధించింది. హేమాహేమీ చిత్రాలను దాటుకుని 2025 కోసం ఆస్కార్ బరిలో నిలిచింది.

Laapataa Ladies Movie officially entry Oscar 2025: చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించిన 'లాపతా లేడీస్' మూవీ.. తాజాగా మరో ఘనతను సాధించింది. హేమాహేమీ చిత్రాలను దాటుకుని 2025 కోసం ఆస్కార్ బరిలో నిలిచింది.

2025లో భారతదేశం నుంచి ఏ సినిమా అధికారికంగా ఆస్కార్ బరిలో నిలుస్తుందా? అని సినీ ప్రేక్షకులతో పాటుగా ప్రముఖులు ఎదురుచూశారు. ఇక లిస్ట్ లో చాలా పేర్లే వినిపించినప్పటికీ.. ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ, రేసుగుర్రం విలన్ రవి కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఇండియా తరఫున లాపతా లేడీస్ మూవీ ఆస్కార్ బరిలో నిలవడంతో.. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షకలు తెలుపుతున్నారు సినీ ప్రముఖులు.

‘లాపతా లేడీస్’ ఇండియా తరఫున ఆస్కార్ బరిలో కచ్చితంగా నిలుస్తుందని కిరణ్ రావు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేసింది. ఆమె చెప్పినట్లుగానే ఇండియా నుంచి 2025 ఆస్కార్ బరిలో నిలిచింది ఈ చిత్రం. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. 2001లో జరిగిన గ్రామీణ కథ ఇది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు అనుకోకుండా రైలు ప్రయాణంలో తారుమారు అయిన ఘటన ఇతివృత్తంగా లాపతా లేడీస్ మూవీ తెరకెక్కింది. ఆమిర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇక ఈ మూవీ ఎన్నో ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు. గతేడాది టోరంటో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శించారు. అలాగే సుప్రీం కోర్టు 75 ఏళ్ల వేడుకలో సైతం ఈ మూవీని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేశారు.

అదీకాక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ అవార్డుల్లో క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో అవార్డును దక్కించుకుంది. ఇక ఇప్పుడు హేమాహేమీ చిత్రాలను దాటుకుని ఇండియాను నుంచి ఆస్కార్ కు వెళ్లింది. కాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 1న విడుదలైన లాపతా లేడీస్ ఊహించని విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 4-5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఆస్కార్ వేదికపై సత్తాచాటడానికి సిద్దమవుతోంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. మరి ‘లాపతా లేడీస్’ మూవీ ఇండియా నుంచి  2025 ఆస్కార్ బరిలో నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments