Chandrakanth: చంద్రకాంత్‌ ఆత్మహత్యపై కరాటే కళ్యాణి పోస్ట్‌ వైరల్‌.. ఆపలేకపోయానంటూ

నటుడు చంద్రకాంత్‌ మృతిపై కరాటే కళ్యాణి చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. చందు తనతో చేసిన వాట్సాప్‌ చాట్‌ని షేర్‌ చేసింది. ఆ వివరాలు..

నటుడు చంద్రకాంత్‌ మృతిపై కరాటే కళ్యాణి చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. చందు తనతో చేసిన వాట్సాప్‌ చాట్‌ని షేర్‌ చేసింది. ఆ వివరాలు..

త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ గత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె ప్రియుడు, సహనటుడు చంద్రకాంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక పవిత్ర మృతిని తట్టుకోలేకపోయిన చంద్రకాంత్‌.. శుక్రవారం మణికొండలోని పవిత్ర నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. పవిత్ర లేని లోకంలో తాను ఉండలేనంటూ వెళ్లిపోయాడు. ఆత్మహత్యకు ముందు సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు చేశాడు. చివరకు ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక చందు మృతి ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. దీనిపై ప్రముఖ నటి కరాటే కళ్యాణి స్పందిస్తూ.. తన తమ్ముడు దూరమయ్యాడంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. ఇక గత కొన్ని రోజుల నుంచి తమ్ముడు చందుతో చేసిన వాట్సప్ చాటింగ్‌ను కూడా షేర్ చేసింది కళ్యాణి.

ఈమేరకు కళ్యాణి తన సోషల్‌ మీడియా ఖాతాలో చేసిన పోస్ట్‌ వైరల్‌గా ఉంది. ‘‘నేనునుండను చనిపోతాను అని చందు నాతో ముందే అన్నాడు. కానీ ధైర్యం చెప్పాను. చందు మనసులో ఇలాంటి ఆలోచన ఉందని నాకు అర్థం అయ్యి.. దాన్నుంచి అతడిని బయటకు తీసుకు రావడానికి కావాలని చాలా సార్లు మాట్లాడాను. ఆత్మహత్య పాపం వద్దు అని చెప్పా. కానీ ఆపలేక పోయాను. చందు యాదవ్ అని పిలిస్తే.. మీరొక్కరే అలా పూర్తి పేరుతో పిలుస్తారు అని అనేవాడు.. విలన్ గ్యాంగ్‌లో నా అసిస్టెంట్‌గా చాలా సీరియల్స్‌లో చేశాడు.. త్రినయనిలో మేము కలిసి చేశాం.. నిన్న ఒకరోజు జర్నీలో ఉండి నీకు కాల్ చెయ్యలేదు తమ్ముడు. ఇంతలో ఇలా దూరం అవుతావు అని అనుకోలేదు తమ్ముడు.. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని వాట్సప్ షాట్‌ను షేర్ చేసింది కరాటే కళ్యాణి.

‘‘నేను వెళ్లడమే కరెక్ట్.. చనిపోకుండా ఇక్కడే ఉంటే.. పిచ్చోడ్ని అవుతాను.. లేదా తాగుబోతుగా మారి ఇంట్లో వాళ్లకి ఇబ్బంది కలిగిస్తాను.. నేను వెళ్తున్నాను.. ఎవ్వరికి చెప్పకండి’’ అంటూ చందు చేసిన మెసెజ్‌లు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. ఈ విషయంలో కరాటే కళ్యాణి ఎంత భరోసా ఇద్దామని ప్రయత్నించినా, ఎంత ధైర్యం చెప్పాలని చూసినా ఫలితం లేకుండా పోయింది. చందు తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేశాడు. చివరకు తన పవిత్ర దగ్గరకు వెళ్లాడు.

ఇక చందుకు శిల్ప అనే మహిళతో 11 ఏళ్ల క్రితమే వివాహం అయ్యింది. పవిత్రతో పరిచయం తర్వాత.. భార్యాబిడ్డలను, కన్న వాళ్లను పట్టించుకోవడం మానేశాడని.. వారు ఆరోపించారు. ఇక పవిత్ర తన కొడుకు జీవితాన్ని నాశనం చేసిందని అతడి తల్లి కన్నీరుమున్నీరవుతుంది. ఇక పవిత్ర కోసం తన భర్త చందు తనను చిత్ర హింసలు పెట్టాడని.. చివరకు ఆత్మహత్య చేసుకుని తమకు తీరని అన్యాయం చేశాడని కన్నీటిపర్యంతం అయ్యింది.

Show comments