Pic Talk: సీరియల్స్‌లో చీరకట్టుతో కనిపించే ఈ నటి.. ఇంత మోడ్రన్‌గా ఉంటదా!

సీరియల్స్‌లో చీరకట్టుతో కనిపించే ఈ నటి.. ఇంత మోడ్రన్‌గా ఉంటదా!

చిరంజీవి, రంభ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హిట్లర్. ఇందులో చిరంజీవికి పెద్ద చెల్లెలిగా నటించిన నటి గుర్తుందా.. సీరియల్లో ఎప్పుడు ఏడుస్తూ.. ఏడిపిస్తూ అలరించిన ఈ బ్యూటీ. ఎప్పుడు చీర కట్టులోనే కనిపించేది. ఇప్పుడు ఎలా ఉందంటే..?

చిరంజీవి, రంభ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హిట్లర్. ఇందులో చిరంజీవికి పెద్ద చెల్లెలిగా నటించిన నటి గుర్తుందా.. సీరియల్లో ఎప్పుడు ఏడుస్తూ.. ఏడిపిస్తూ అలరించిన ఈ బ్యూటీ. ఎప్పుడు చీర కట్టులోనే కనిపించేది. ఇప్పుడు ఎలా ఉందంటే..?

ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి సీరియల్స్. కుటుంబ కథా చిత్రాలు వచ్చినప్పుడు, సినిమా మంచి టాక్ వస్తున్నప్పుడు మాత్రమే థియేటర్లకు వెళుతున్నారు మహిళలు. సినిమాల కన్నా వారి వ్యాపకమంతా సీరియల్స్ మీదే ఉంటుంది. ఇంట్లో ఉంటున్న మహిళలు మాత్రమే కాదు.. ఆఫీసులకు వెళుతున్న నారీమణులు సైతం యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా యాప్స్ ద్వారా కూడా వీటిని మిస్ కాకుండా వాచ్ చేస్తుంటారు. అంతలా మహిళల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి ధారావాహికలు. ఇప్పుడు బోలెడన్నీ సీరియల్స్ వచ్చాయి. టీవీ రంగం అభివృద్ధి చెందుతున్న సమయంలో లిమిటెడ్‌గా సీరియల్స్ వచ్చేవి. సినిమాలకు ఏ మాత్రం తీసిపోని కథలతో తెరకెక్కేవి. కన్నీటిని తెప్పించేవి.

అలా ఏడుపుగొట్టు సీరియల్స్‌గా ముద్ర పడ్డాయి కళంకిత, అంతరంగాలు. కళంకితలో మెయిన్ రోల్ చేసి.. అంతరంగాలులో ముఖ్యమైన పాత్ర పోషించింది నటి అశ్విని. ‘ఓ కళంకిత..కళలకే అంకితా’ అంటూ సాగిపోయే సాంగే ఏడుపు తెప్పిస్తుంది. ఇందులో ఆమె పడే కష్టాలు చూస్తే.. ఎందుకమ్మా నీ మీద దేవుడు ఇంత పగబట్టాడు అనిపించకమానదు. అంతలా అప్పట్లో ఆకట్టుకుంది ఈ సీరియల్. ఈ ధారావాహిక మొత్తం ఆమె ఏడుస్తూనే కనిపించింది. దీంతో క్వీన్ ఆఫ్ క్రై అన్న పేరు వచ్చేసింది. చీర కట్టుతోనే కనిపించేది. ఆ తర్వాత 1998లో వచ్చిన అంతరంగాలులో కూడా నటుడు అచ్యుత్‌ను ఇష్టపడుతుంది. కానీ అతడు ఇష్టపడడు. మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇందులో కూడా అశ్వినీకి ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. ‘గుండెకు సవ్వడెందుకో, పెదవులకి వణుకెందుకో.. పరువానికి పరుగెందుకో.. తనువుకి తపనెందుకో’ అంటూ సాగిపోతుంది ఈ పాట.

అప్పట్లో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు ఈ రెండు సీరియల్స్‌కు … అశ్వినికి కూడా. అశ్విని కేవలం సీరియల్ నటి మాత్రమే కాదు.. వెండితెరపై అనేక సినిమాల్లో నటించింది. మలయాళ ఇండస్ట్రీ నుండి తమిళం,తెలుగులో అనేక సినిమాలు చేసింది. ఆమె స్క్రీన్ నేమ్ రుద్ర. ఆమె అసలు పేరు అశ్విని నంబియార్. కేరళకు చెందిన ఆమె.. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా ఆమెను ఇంట్రడ్యూస్ చేశాడు. పోస్ట్ బాక్స్ నంబర్ 27 చిత్రంలో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆంటీ చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు గుర్తింపు తెచ్చింది హిట్లర్ మూవీ. ఇందులో చిరంజీవి పెద్ద చెల్లెలిగా నటించింది. గ్లామర్ పాత్రలు చేయలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం మూవీలో సౌందర్య స్నేహితురాలిగా కనిపిస్తుంది. తెలుగులో చివరిగా శ్రీహరి పోలీస్ చిత్రంలో నటించింది. ఎప్పుడు చీర కట్టుతో మెప్పించే ఈ సీరియల్ నటి ..అప్పటి కన్నా ఇప్పుడు మరింత అందంగా, అడ్మైర్ చేసేస్తుంది. ప్రస్తుతం తమిళ సీరియల్స్ చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ.. మోడ్రన్ దుస్తుల్లో రచ్చ చేస్తుంది.

Show comments